BigTV English

Serial Actress Sireesha: మరో జంట విడాకులు.. ప్రకటించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ హీరోయిన్ శిరీష!

Serial Actress Sireesha: మరో జంట విడాకులు.. ప్రకటించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ హీరోయిన్ శిరీష!

Serial Actress Sireesha Divorce with Husband: వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా ఈ మధ్య విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ తన భార్యతో విడాకులు ప్రకటించిన విషయం తెల్సిందే. తమ 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు తెలిపారు. ఇక తాజాగా బుల్లితెర నటి శిరీష సైతం.. తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.


మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష..వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. మొగలిరేకులు, స్వాతిచినుకులు,రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే చెల్లెలి కాపురం సీరియల్ శిరీషకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. చెల్లి కోసం.. మతిస్థిమితం లేని వ్యక్తిని పెళ్ళాడి.. అతడిని ఎలా మార్చుకుంది అనే కథతో తెరకెక్కిన ఈ సీరియల్ లో భూమి పాత్రలో శిరీష నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష.. నవీన్ వల్లభనేనిని వివాహమాడింది. పెళ్లి తరువాత కూడా ఆమె సీరియల్స్ ను కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈ జంటకు శ్రీఈష్ అనే బాబు కూడా ఉన్నాడు. ఈ జంట చాలా ప్రోగ్రామ్స్, షోస్ లలో కూడా అలరించారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కానీ, షోస్ లలో కానీ వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. దీంతో అభిమానులందరూ.. ఈ జంట విడిపోయారా.. ? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ పుకార్లపై శిరీష స్పందించింది. నవీన్ తో తాను విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది.


Also Read: Prabhas and Payal : అక్కడ పాయల్.. ఇక్కడ ప్రభాస్.. ఏంటి మేటర్ ?

“నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులతో వ్యక్తిగత అప్‌డేట్‌ను షేర్ చేస్తున్నాను.. నవీన్ మరియు నేను, ఒకప్పుడు భార్యాభర్తలు, మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్ధం చేసుకొని మాకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాము. విమర్శలు వద్దు. ప్రేమ, దయ పంచండి. నాకు నవీన్ పట్ల గౌరవం తప్ప మరేమీ లేదు, ప్రజల దృష్టిలో ఉన్న వ్యక్తిగా, ఈ వార్తను మీ అందరితో పంచుకోవడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. మీరు మాపై చూపించే ప్రేమకు ఎప్పుడు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్  నెట్టింట వైరల్ గా మారింది.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×