E-Paper
Advertisement

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం
Advertisement

Faria Abdullah: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఫరియ.. ఆ తరువాత అంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతుంది. ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క చిన్న చిన్నపాత్రలు చేస్తుంది. ఇక ఈ మధ్యనే కల్కి సినిమాలో ఒక చిన్న షాట్ లో కూడా కనిపించి మెప్పించింది.

చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది.. ఒక లక్కీ ఛాన్స్ పట్టేసింది. శ్రీసింహ హీరోగా నటించిన మత్తు వదలరా సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెల్సిందే. మత్తు వదలరా 2 .. సెప్టెంబర్ 13 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

Advertisement

ఇక ఈ చిత్రంలో ఫరియా.. నిధి అనే పాత్రలో నటిస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సాధ్యమైనంత వరకు తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

డ్రామా నక్కో మామ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు లిరిక్స్ అందించింది, సాంగ్ పాడింది ఫరియానే కావడం విశేషం. ఇక హిందీ లిరిక్స్ తో ఒక ర్యాపర్ గా ఫరియా పాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక కాల భైరవ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్  అని చెప్పొచ్చు.

Advertisement

ఇక వీడియోలో శ్రీ సింహా, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. మొత్తానికి ప్రమోషనల్ సాంగ్ బాగానే హైప్ తీసుకొచ్చింది. ఈ సాంగ్ విన్నవారు.. ఫరియా లో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా ఫరియాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×