E-Paper
Advertisement

OG Movie: అనుకున్నదే అయ్యింది.. OG వాయిదా.. ?

OG Movie: అనుకున్నదే అయ్యింది.. OG  వాయిదా.. ?
Advertisement

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాజకీయాలను పక్కన పెట్టి మరీ పవన్.. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేశాడు. అంటే సగానికి పైగా సినిమా షూట్ పూర్తి అయ్యినట్లు సమాచారం. మిగతా సగం ఎన్నికల ఫలితాలు వచ్చాకా జరగనుంది. మొదటి నుంచే ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు.

Advertisement

బ్రో సినిమా తరువాత పవన్ వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ ఏడాది OG తో అభిమానులు పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న టైమ్ కు రాదన్న వార్త వినిపిస్తుంది. మొన్నటికి మొన్న లక్కీ భాస్కర్ .. ఇదే డేట్ ను లాక్ చేసినప్పటి నుంచి ఇదే అనుమానం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. OG డిజిటల్ రైట్స్ ఇంకా ఫినిష్ కాలేదట. ఓటిటీలు స్లాట్స్ లేక OG ని ఇంకా కొనలేదని, ఆ బిజినెస్ జరగకపోవడంతో సెప్టెంబర్ 27న ఈ సినిమా రావడం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త వినడంతోనే అభిమానులు అసహనానికి గురవుతున్నారు. ఒకవేళ ఈ ఏడాది కనుక మిస్ అయితే OG సంక్రాంతి బరిలో దిగుతుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×