BigTV English

Prajwal Revanna: సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ

Prajwal Revanna: సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ

PM Prajwal Revanna Sent to 6-day SIT Custody: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. జూన్ 6 వరకు సిట్ కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నిరోజులు విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ ను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదేశానికి వచ్చి సిట్ విచారణకు సహకరించాలంటూ జీడీఎస్ నేతలు దౌవెగౌడ, కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా, జూన్ 6 వరకు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.


Also Read: వడదెబ్బతో ఎన్నికల విధుల్లో ఆరుగురు జవాన్లు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

ఇదిలా ఉంటే.. ఎయిర్ పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సిబ్బంది అంతా కూడా మహిళలే కావడం గమనార్హం. ‘ఎంపీ పదవిని, పలుకుబడిని అడ్డంపెట్టుకుని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు.. అందుకే ప్రజ్వల్ ను అరెస్ట్ చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం’ అంటూ సిట్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×