BigTV English

Dulquer Salmaan: అక్కడ గట్టిగా నొక్కింది, భరించలేకపోయా.. లైంగిక వేధింపులపై హీరో షాకింగ్ కామెంట్స్

Dulquer Salmaan: అక్కడ గట్టిగా నొక్కింది, భరించలేకపోయా.. లైంగిక వేధింపులపై హీరో షాకింగ్ కామెంట్స్

Dulquer Salmaan.. మలయాళం సినీ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలు భాషా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు మీడియా ముందుకు వస్తూ.. మగవారి నుంచి వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియాతో చెప్పుకుంటున్నారు. ఇక అంతేకాదు తమ ఇండస్ట్రీలలో కూడా హేమా కమిటీ లాంటి ఒక కమిటీ వేయాలని కోరుతున్నారు. ఇలా ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబుతూ ఉండగా.. ఇంతలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dilquer salmaan) లైంగిక వేధింపులు, మగవారి నుండి ఆడవారికే కాదు ఆడవారి నుండి మగవారికి కూడా ఉన్నాయి అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.


నా పిరుదులను పట్టుకొని గట్టిగా నొక్కింది..

Dulquer Salmaan: Sexual harassment is also for men.. Hero's shocking comments..!
Dulquer Salmaan: Sexual harassment is also for men.. Hero’s shocking comments..!

సీతారామం సినిమాతో తెలుగులో నేరుగా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. మహానటి సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం వివిధ భాషలలో సినిమాలు చేస్తూ మంచి పేరు అందుకుంటున్న ఈయన ఒకసారి తన కెరీర్ లో తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వృద్ధురాలు తనను అనుచితంగా తాకిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఆమె నా పిరుదులను పట్టుకొని గట్టిగా నొక్కింది. దాంతో నేను భరించలేని నొప్పిని అనుభవించాను. ఈ అనుభవం చాలా ఇబ్బందికరంగా, విచిత్రంగా అనిపించింది అంటూ తెలిపారు దుల్కర్ సల్మాన్. మొత్తానికైతే ఏ ఉద్దేశంతో అలా పట్టుకుంటారో తనకు తెలియదని , కానీ అలా చేయడం తనకు ఇబ్బందికరంగా మారిందని అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల గురించి వినిపిస్తున్న వార్తల మధ్యలో ఈయనచేసిన ఇలాంటి కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి


దుల్కర్ సల్మాన్ సినిమాలు..

ఇక దుల్కర్ సల్మాన్ విషయానికొస్తే.. సీతారామం సినిమాతో మంచి ఫాలోయింగ్ అందుకున్న ఈయన తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాతో అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాలే కాకుండా గన్స్ అండ్ గులాబ్స్ వంటి ఓటిటి వెబ్ సిరీస్ లో కూడా దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 18 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

దుల్కర్ సల్మాన్ కెరియర్…

దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే ఈయన ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకే. 2012లో సెకండ్ షో అనే మలయాళం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ హోటల్ చిత్రంలో నటించారు.ఈ సినిమా జాతీయ చలనచిత్రం పురస్కారాలలో ఉత్తమ ప్రజా ధారణ పొందిన వినోద భరిత చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక మలయాళం లోనే కాదు తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక మలయాళం, తమిళ్ చిత్రాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియోస్ కి దగ్గరవుతున్నారు. ఇప్పుడు లైంగిక ఆరోపణలపై అలాంటి కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×