E-Paper
Advertisement

Dunki Trailer : సలార్ కు షాక్ ఇచ్చిన షారుఖ్ .. దంగల్ సృష్టిస్తున్న డుంకి ట్రైలర్ ..

Dunki Trailer : సలార్ కు షాక్ ఇచ్చిన షారుఖ్ .. దంగల్ సృష్టిస్తున్న డుంకి ట్రైలర్ ..
Advertisement

Dunki Trailer : బాలీవుడ్ బాద్షా టాలీవుడ్ మార్కెట్ పై కన్ను వేసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న షారుక్ ఖాన్ తన మూడవ చిత్రంతో బాక్స్ ఆఫీస్ పై వార్ కి వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 21న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సంవత్సరం రెండు సినిమాలు బంపర్ ఓపెనింగ్స్ రావడంతో ముచ్చటగా ఈ మూడవ చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

పైగా ఈ చిత్రానికి రాజ్ హిరానీ డైరెక్టర్ కావడంతో మూవీ పై బజ్ బాగా క్రియేట్ అయింది. సలార్ కు పోటీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ ని కూడా రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో లైన్ క్లియర్ గా ఉన్నా టాలీవుడ్ లో సలార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తే లెక్కలు కాస్త తారుమారు అవుతుందేమో అన్న అనుమానం కలగక మానదు.

Advertisement

ఫ్రెండ్‌షిప్ , కామెడీ, ఎమోషన్స్ ,విషాదం ఇలా జీవితంలో అన్ని రుచులను ఒకేసారి కలిపి తినే ఉగాది పచ్చడిలా ఉంది ఈ ట్రైలర్. ఇందులో ఉన్న ఎమోషన్స్ రాబోయే మూవీ పై ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఇంగ్లీష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే పల్లెటూరి కుర్రాడు పాత్రలో షారుక్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే పాపం ఎంత ప్రయత్నించినా ఇంగ్లీష్ మాత్రం రాదు దాంతో దొంగ దారిలో యూకే లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు.. ఈ నేపథ్యంలో అతను దొరికిపోవడం.. ఆ తర్వాత చోటుచేసుకునే ఆసక్తికర అంశాలతో కథ ముందుకు సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

షారుక్ ఆ జర్నీలో తన స్నేహితులతో కలిసి పడే ఇబ్బందులు .. వాటిని ఎదుర్కొనే విధానం ఈ ట్రైలర్ లో ఎంతో క్లియర్ గా చూపించారు. ఎప్పటిలా షారుక్ ఈ మూవీలో తన కామెడీతో అదరగొట్టాడు అన్న విషయం ట్రైలర్ లో స్పష్టంగా అర్థం అవుతుంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే ,త్రీ ఇడియట్స్.. లాంటి హిలేరియస్ కామెడీతో మంచి సందేశాన్ని అందించిన చిత్రాలను తెరకెక్కించిన రాజ్ హిరని ఈ మూవీని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ సలార్ కు గట్టిగానే పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Advertisement

.

.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×