BigTV English

Emraan Hashmi: ఆ హీరోయిన్ ను అలా అనడం తప్పే.. క్షమించాలని కోరిన OG విలన్

Emraan Hashmi: ఆ హీరోయిన్ ను అలా అనడం తప్పే.. క్షమించాలని కోరిన OG విలన్

Emraan Hashmi: బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా ఇమ్రాన్ హష్మీ కి మంచి పేరు ఉంది. అదొక్కటే కాదు సీరియల్ కిస్సర్ అని కూడా అతడిని పిలుస్తారు. అందుకు కారణం.. ఇమ్రాన్ హష్మీ నటించే ప్రతి సినిమాలో కూడా కచ్చితంగా లిప్ కిస్ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ OG సినిమాతో తెలుగుకు పరిచయమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తున్నాడు.


ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మొదటిసారి ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను ఫినిష్ చేసిన చిత్రబృందం.. ఎన్నికల వలన గ్యాప్ తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో పవన్ గెలవడంతో మరింత ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇమ్రాన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు క్షమాపణలు చెప్పాలని తెలిపాడు. గతంలో ఇమ్రాన్.. కాఫీ విత్ కరణ్ షోకు వెళ్ళినప్పుడు.. ఐశ్వర్య ప్లాస్టిక్ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఇదొక పెద్ద దుమారాన్నే రేపింది. ఇక ఆ వివాదాన్ని మరోసారి ఇమ్రాన్ గుర్తుచేసుకున్నాడు. తాను కావాలని ఆమెను ప్లాస్టిక్ అనలేదని, సరదాగా చెప్పినట్లు తెలిపాడు.


” 2014లో కాఫీ విత్ కరణ్ షోలో నేను చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను నేను ప్లాస్టిక్ అనడం అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. అవి కేవలం నేను సరదాగా అన్న మాటలు. వాటిని హైలైట్ చేసి.. వేరే ఉద్దేశ్యంతో అన్నట్లు చెప్పుకొచ్చారు. అందుకు నేను ఎంతో బాధపడుతున్నా.. ఐశ్వర్య అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆమె నా మాటల వలన బాధపడితే నేను క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇమ్రాన్ టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలంటే OG రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×