BigTV English

krejcikova Defeats Paolini: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ

krejcikova Defeats Paolini: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ

Wimbledon Women’s Singles: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా బార్బొరా క్రెజికోవా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. సంచలనాలకు వేదికగా, అనూహ్య ఫలితాలతో సాగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ గా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) అవతరించింది. శనివారం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ఇటలీకి చెందిన పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ గెలుపొంది జాస్మినెను ఒత్తిడిలో పడేసి, మూడో సెట్ ను విజయంతో ముగించి ఛాంపియన్ గా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్ మనీని క్రెజికోవా సొంతం చేసుకుంది.


వింబుల్డన్ ఫైనల్ చేరడం వీరిద్దరికీ ఇదే మొదటిసారి. అయితే, తాజా విజయంతో క్రెజికోవా రెండో గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. 2021 ఫ్రెంచ్ ఓపెన లో కూడా క్రెజికోవా విజతేగా నిలిచిన విషయం తెలిసిందే. 2016లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచిన తరువాత జరిగిన ప్రతీ వింబుల్డన్ లోనూ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చారు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది.

అయితే, వింబుల్డన్ ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న జాస్మినె కల చెదిరింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా జేజేలు అందుకున్న ఈ యంగ్ స్టర్ మరోసారి ఫైనల్ లో తడబడింది. ఆడుతున్న తొలి సీజన్ లో వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టిన జాస్మినె మహిళల సింగిల్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా చరిత్ర నెలకొల్పింది. టైటిల్ పోరులో జాస్మినె గెలిచి ఉంటే వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన మొదటి ఇటలీ టెన్నిస్ ప్లేయర్ గా కొత్త అధ్యాయం లిఖించేది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×