E-Paper
Advertisement

Fahadh Faasil: పుష్ప వలన నాకు ఒరిగిందేం లేదు.. ఫహాద్ సంచలన వ్యాఖ్యలు

Fahadh Faasil: పుష్ప వలన నాకు ఒరిగిందేం లేదు.. ఫహాద్ సంచలన వ్యాఖ్యలు

Fahadh Faasil: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని అన్ని ఇండస్ట్రీల హీరోలు అందరికి పరిచయం అవుతున్నారు. అయితే ఫహాద్ మాత్రం తెలుగువారికి పుష్పతో పరిచయం అయ్యాడు.. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ తో ఆయన ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ కు పోటీగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అతని నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

ఇక పుష్ప సినిమా తరువాత బన్నీ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. నేషనల్ క్రష్ రష్మిక.. శ్రీవల్లిగా పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. సుకుమార్ కు సైతం మంచి పేరు వచ్చింది.. అంతెందుకు పుష్ప ఫ్రెండ్ కేశవ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఫహాద్ కు మాత్రం పుష్ప ఏం చేసింది లేదు. ఈ విషయాన్నీ అతను నిర్భయంగా ఒప్పుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫహాద్ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు. పుష్ప వలన తనకు ఒరిగిందేమి లేదని చెప్పి షాక్ ఇచ్చాడు.

పుష్ప తరువాత మీ క్రేజ్ కేరళ బౌండరీస్ దాటిందని మీరు అనుకుంటున్నారా.. ? అన్న ప్రశ్నకు ఫహాద్ సమాధానమిస్తూ.. ” పుష్ప నాకు చేసిందేమి లేదు. ఈ విషయం నేను సుకుమార్ సార్ ముందే చెప్పాను. ఇందులో దాచాల్సిన విషయం ఏమి లేదు. చాలా నిజాయితీగా ఉండాలి. మలయాళంలో నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నా స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. కేవలం సుకుమార్ సర్ మీద ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేశాను. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. పుష్ప వలన నా క్రేజ్ పెరిగిందని కానీ, దాని వలన నాకేదో వచ్చేసిందని కానీ నేను అనుకోవడం లేదు. నమ్మను కూడా.. ” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫహాద్ ఎంతో నిజాయితీగా మాట్లాడతాడు అని తెలుసు కానీ, మరీ ఇంత నిజాలు మాట్లాడతాడు అనుకోలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఆవేశం సినిమాతో ఫహాద్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలత్ బిజీగా ఉన్నాడు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×