E-Paper
Advertisement

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?
Advertisement

Family Star: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో ‘లైగర్’ ఎన్నో అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న హీరో, దర్శక నిర్మాతలు, అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. ఇక ‘లైగర్’ తర్వాత విజయ్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఈ సారి భారీ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తనకు ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో ఓ మూవీ చేస్తున్నారు.

దర్శకుడు పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘గీత గోవిందం’ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయ్‌పై కొన్ని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20 నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట.

Advertisement

ఇకపోతే సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×