E-Paper
Advertisement

Venu Swamy: పవనే సీఎం..ప్లేట్ ఫిరాయించిన వేణుస్వామి.. పవన్ ఫ్యాన్స్ బాగా ఇచ్చినట్టున్నారు

Venu Swamy: పవనే సీఎం..ప్లేట్ ఫిరాయించిన వేణుస్వామి.. పవన్ ఫ్యాన్స్ బాగా ఇచ్చినట్టున్నారు
Advertisement

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలను చూసి ఎవరు స్టార్స్ అవుతారు.. ? ఎవరికి పెళ్లిళ్లు అవుతాయి.. ? ఎవరు విడాకులు తీసుకుంటారు.. ? ఇలాంటివి చెప్పుకుంటూ వస్తాడు. అలా ఒకేసారి సమంత- చైతన్య విడిపోతారని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్టే నాలుగేళ్ళ తరువాత ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ఇక అప్పటినుంచి వేణుస్వామి చెప్పింది నిజమే అని కొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ఏదో జరిగిందిలే అని వదిలేశారు. ఇక ఈసారి ఎలక్షన్స్ గురించి వేణుస్వామి చెప్పిన మాటలు కొన్నిరోజులుగా సోషల్ మీడియాను చేస్తున్నాయి. గతంలో వేణుస్వామి పవన్ గురించి చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కు సీఎం అయ్యే రాత లేదని, ఈసారి కూడా జగన్ సీఎం అవుతాడని చెప్పుకొచ్చాడు.

Advertisement

పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా.. అతనికి రాజకీయాలు సెట్ కావు అని, సినిమాలు చేసుకోవడమే మంచిదని సలహాలు ఇచ్చాడు. ఈ వీడియోపై పవన్ ఫ్యాన్స్ గుర్రు అయ్యారు. వేణుస్వామి .. జగన్ అభిమాని అని, అందుకే ఇలా మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అతనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, వేణుస్వామి సైతం ప్లేట్ మార్చేశాడు. ఏపీ ఎలక్షన్స్ జరిగి.. అందరూ ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలామంది ఈసారి కూటమి వస్తుంది అని చెప్పుకొస్తున్నారు.

తాజాగా వేణుస్వామి సైతం పవన్ సీఎం అయితే చూడాలని ఉందని చెప్పడం ఆశ్చర్యంగా మారింది. ” నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చినే. ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. జగన్ మోహన్ రెడ్డిని ఓడించి పవన్ సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఈ వీడియో లేటెస్ట్ దా.. ? లేక పవన్ ఫ్యాన్స్ ఎడిట్ చేసిందా..? అనేది తెలియాల్సి ఉంది. మరి వేణుస్వామి చెప్పినట్లు పవన్ సీఎం అవుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×