E-Paper
Advertisement

Farah Khan: బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం..

Farah Khan: బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Farah Khan: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి మేనకా ఇరానీ(79) ముంబైలో మరణించారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ లో చేర్పించి పలు సర్జరీలు కూడా చేయించారు. అయినా ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో నేడు హాస్పిటల్ లోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.

ఇక తల్లి మరణించడంతో ఫరా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండువారాల క్రితమే మేనక పుట్టినరోజును ఫరా ఖాన్, సాజిద్ ఖాన్ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆరోజు తన తల్లి గురించి ఫరా ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది.

Advertisement

” మనమందరం మా తల్లులను పెద్దగా తీసుకుంటాము, ముఖ్యంగా నన్ను! నేను మా అమ్మ మేనకను ఎంతగా ప్రేమిస్తున్నానో ఈ గత నెలలో వెల్లడైంది. ఆమెతో నేను చూసిన అత్యంత బలమైన, ధైర్యవంతురాలు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండండి, అమ్మా, ఇంటికి తిరిగి రావడానికి ఈ రోజు మంచి రోజు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యింది.

ఇక ఆమె పుట్టినరోజు అయిన రెండు వారాలకే మేనక మరణించడం ఎంతో బాధాకరమని పలువురు చెప్పుకొస్తున్నారు. తమ తండ్రి కమ్రాన్ ఖాన్ మరణానంతరం ఆమె, ఆమె సోదరుడు సాజిద్ ను మేనక ఎంత కష్టపడి పెంచిందో ఫరా ఎప్పుడు చెప్తూ ఉండేది.

Advertisement

మేనకా ఇరానీ.. నటి డైసీ ఇరానీ మరియు స్క్రీన్ రైటర్ హనీ ఇరానీల సోదరి. చిత్రనిర్మాతలు జోయా మరియు ఫర్హాన్ అక్తర్ ఆమెకు మేనకోడలు మరియు మేనల్లుడు అవుతారు. మేనకా మరణవారంతా బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. మేనకా చివరి చూపు చూడడానికి పలువురు ప్రముఖులు ఫరా ఇంటికి తరలివస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×