BigTV English

Crocodile on Road : అమ్మో! మొసలి.. హడలెత్తిపోయిన ప్రజలు

Crocodile on Road : అమ్మో! మొసలి.. హడలెత్తిపోయిన ప్రజలు

Crocodile On Road in Vadodara : అసలే వర్షాకాలం. దేశమంతా కుండపోత వర్షాలు. ఆ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పోటెత్తి.. వరదలు ముంచెత్తుతున్నాయి. నిలువనీడ లేకుండా పోయింది. వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. మొన్నటి వరకూ ఏపీ, నిన్నటి వరకూ తెలంగాణ భారీ వర్షాల్లో తడిచి ముద్దయ్యాయి. వ్యాధులు ప్రబలుతున్నాయి. వైరల్ ఫీవర్లు రాజ్యమేలుతున్నాయి.


తెలుగు రాష్ట్రాలను వీడిన వర్షాలు ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రలను చుట్టుముట్టాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వర్షాలకు నీరు రోడ్లపైకి చేరుతుండటంతో.. జల జీవులు కూడా రోడ్లపైకి వచ్చి ప్రజల్ని భయపెడుతున్నాయి.

తాజాగా గుజరాత్ లోని వడోదరలో రోడ్డుపైకి మొసలి రావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. రోడ్డుపైకి చేరిన నీటిలో మొసలి ఉండటాన్ని గమనించిన వ్యక్తి.. దానిని రాయితో కొట్టాడు. దాంతో.. ఆ మొసలి పరుగు లంకించింది. తననేం చేస్తారోనన్న భయంతో మొసలి పరుగు పెడితే.. మొసలిని చూసి అక్కడున్నవారు భయపడ్డారు. అలా అలా ఆ మొసలి అందరూ చూస్తుండగానే పొదల్లోకి దూరి మాయమైంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు.


Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×