E-Paper
Advertisement

Kiara Advani in Don 3: రణవీర్ సింగ్‌తో కియారా రొమాన్స్.. ఇట్స్ అఫీషియల్!

Kiara Advani in Don 3: రణవీర్ సింగ్‌తో కియారా రొమాన్స్.. ఇట్స్ అఫీషియల్!
Advertisement
Kiara Advani in Don 3

Kiara Advani in Don 3: కియారా అడ్వాణి.. పెళ్లై ఏడాదికాలమైనా.. ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాదికాలంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో కనిపిస్తుందనుకుంటే.. ఆ సినిమాను దర్శకుడు శంకర్ ఇప్పుడప్పుడే విడుదల చేసేలా కనిపించడం లేదు. గతేడాది దీపావళికే వచ్చేస్తున్నామని ఊరించి.. ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించారు. కాగా.. తాజాగా కియార్ అడ్వానీ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మరో భారీ బడ్జెట్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది.

ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న డాన్ 3 సినిమాలో కియారా అడ్వాణీనే హీరోయిన్ గా చేస్తున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. రణవీర్ – కియారా జంటగా నటిస్తున్న తొలిసినిమా ఇది. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగా ఉంటాయని తెలుస్తోంది. తొలిసారి వీరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయగా.. సిల్వర్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని ఆడియన్స్ తో పాటు.. బాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

Read More: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత

కాగా.. డాన్ 3 (DON 3) ఫ్రాంచైజీలో తాను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని కియారా అడ్వాణీ ట్వీట్ చేసింది. తనకు ప్రేక్షకుల ప్రేమ, మద్దతు కావాలని X వేదికగా కోరింది. డాన్ 3 సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పుష్కర్, గాయత్రి, ఫర్హాన్ అక్తర్ సహ రచయితలుగా ఉన్నారు.

Advertisement

డాన్ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోడి. డాన్, డాన్ 2 సినిమాల్లో వీరి జోడి ప్రేక్షకులను అలరించింది. ఈ ఫ్రాంచైజీలో డాన్ 3 కి వచ్చేసరికి.. డైరెక్టర్ హీరోను మార్చేశారు. షారుఖ్ కు బదులు.. రణవీర్ సింగ్ ను, ప్రియాంకకు బదులు కియారాను తీసుకున్నారు. మరి ఈ జంట ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×