BigTV English

6,000 Buses for Medaram Jatara: మేడారం జాతరకు 6 వేల బస్సులు.. రెగ్యులర్ సర్వీసులు తగ్గింపు!

6,000 Buses for Medaram Jatara: మేడారం జాతరకు 6 వేల బస్సులు.. రెగ్యులర్ సర్వీసులు తగ్గింపు!

6,000 TSRTC Buses for Medaram Jatara: మేడారం మహా జాతరకు భక్తులు భారీగా తరలి వెళుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం మేడారం 6 వేల బస్సులను నడుపుతోంంది. ఈ వివరాలను ఎక్స్ వేదికగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వివరించారు.


తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి బస్సు సర్వీసులను మేడారంకు నడుపుతున్నారు. ఇప్పటికే బస్సులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. రద్దీ ఎక్కువైంది. ఈ
నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంది. భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మేడారం జాతరకు భారీగా బస్సులను తిప్పుతోంది. అందువల్లే రెగ్యులర్‌ సర్వీసులను తగ్గించామని సజ్జనార్ తెలిపారు.


Read More: రేపే మహాజాతర.. నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న పయనం..

సాధారణ ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సజ్జనార్ అన్నారు. ఈ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. మేడారం జాతర పూర్తయ్యే వరకు తగిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సాధారణ ప్రయాణికులకు సూచించారు. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×