BigTV English

Fathers Day: సూపర్ నాన్న.. స్పెషల్ ఫోటోలు పంచుకున్న మెగా హీరోలు

Fathers Day: సూపర్ నాన్న.. స్పెషల్ ఫోటోలు పంచుకున్న మెగా హీరోలు

Fathers Day Special Photos Mega Family: అమ్మా.. అనే పిలుపుతో ఎవరినైనా పిలుస్తాం. కానీ నాన్న అనే పిలుపు ఒక్క కన్నతండ్రికే సొంతం. చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శకుడు. ఆపదలో అభయప్రదాత. పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని..భవిష్యత్తులో వాళ్లు ఏం కావాలో దిశానిర్ధేశం చేస్తాడు. నేడు ఫాదర్స్ డేను పురస్కరించుకొని ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తాజాగా, మెగా హీరోలు ఎక్స్ వేదికగా ఫాదర్స్ డే స్పెషల్ విషెస్ చెబుతూ ఫొటోలు పోస్ట్ చేశారు.


ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో..
టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి ఫాదర్స్ డేను పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. ఇందులో అభిమానులకు విషెస్ తెలిపారు. ‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్‌ను చిరంజీవి షేర్ చేశారు.

అందరికీ విషెస్ చెప్పిన స్టైలిష్ స్టార్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. ‘ప్రపంచంలోన తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


క్లీంకారాతో రాంచరణ్‌..
మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఫాదర్స్ డే సందర్భంగా జాతీయ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కావడంతో తన గారలపట్టి క్లీంకారాతో దిగిన ఫొటోను పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటిసారి రాంచరణ్, క్లీంకారాతో సింగిల్‌గా దిగిన ఫొటో బయటకు రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో కుటుంబంతోపాటు కూతురు, తండ్రి అయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పులు తదితర విషయాలను చెప్పుకొచ్చారు.

Also Read: ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులు వీరే.. ఎప్పుడు, ఎక్కడంటే..?

ఎట్టకేలకు క్లీంకారా ఫొటో..
రాంచరణ్, ఉపాసన కుతూరు క్లీంకారాను చూసేందుకు అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో కొన్ని ఫొటోలు బయటకు వచ్చినా ఫేస్ కనిపించకుండా ఉపాసన, రాంచరణ్ జాగ్రత్త తీసుకున్నారు. తాజాగా, ఫాదర్స్ డే సందర్భంగా రాంచరణ్‌తో క్లీంకారా ఫొటో బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×