E-Paper
Advertisement

Kalki 2898 ad: ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులు వీరే.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Kalki 2898 ad: ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులు వీరే.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Advertisement

Kalki 2898ad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ‘KALKI 2898AD’ . వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ మూవీలను తలపించేలా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్‌గా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఒకెత్తయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ ట్రైలర్ హాలీవుడ్ మార్వెల్ మూవీస్ రేంజ్‌లో ఉంటూ సినీ ప్రేక్షకుల్ని, రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అదీగాక ఈ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. అచ్చం మార్వెల్ హీరోలా సేఫ్టీ సూట్ ధరించి అదిరిపోయాడు. ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

దీంతో ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రేక్షకాభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే స్టార్ హీరోలతో ప్రభాస్ ‘బుజ్జి’ కారును డ్రైవ్ చేయిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన ‘కల్కి 2898 ఏడీ’

Advertisement

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చిత్రబృందం త్వరలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కి స్టార్ హీరోలను సైతం గెస్టులుగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందట. అంతేకాకుండా ఒక ఈవెంట్‌గా కాకుండా మూడు ఈవెంట్‌లుగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట. అందులో ఒక ఈవెంట్‌ను జూన్ 23న ఏపీలోని అమరావతిలో నిర్వహించబోతుందని సమాచారం.

ఆ తర్వాత చెన్నై, తర్వాత డిల్లీలో ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×