BigTV English

Fighter OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ఫైటర్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..

Fighter OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ఫైటర్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..


Hrithik Roshan Fighter Movie OTT Release : బాలీవుడ్ స్టార్ హీరో, హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్, అగ్రకథానాయిక దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ అంచనాలతో జనవరి 25న విడుదలైన సినిమా ఫైటర్. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ గా విడుదలైన ఫైటర్.. బాక్సీఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఫైటర్.. 31 రోజుల్లో అంటే ఫిబ్రవరి 25కి రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Also Read : ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్.. వాళ్లదే హవా


ఫైటర్ థియేటర్లలో విడుదలై రెండు నెలలు కావస్తున్నా.. ఇంతవరకూ ఓటీటీలో విడుదల కాలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 20వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఫైటర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

కథేంటంటే..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సంషేర్ పఠానియా అలియాస్ పాటీ (Hrithik Roshan) స్క్వాడ్రన్ లీడర్ గా పనిచేస్తుంటాడు. ధైర్య, సాహసాలకు ఏమాత్రం వెనుకాడని ఫైటర్ పైలట్ అతను. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్విఘ్నంగా నిర్వర్తించే క్రమంలో.. కొన్ని నియమ, నిబంధలను దాటి సాహసాలు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఘటనకు అతను బాధ్యుడని నింద పడుతుంది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఒక ఆపరేషన్ కోసమై శ్రీనగర్ కు వస్తాడు. అక్కడ సీఓ రాకీ సారథ్యంలో మిన్ను (Deepika Padukone), తాజ్ (Karan Singh), బాష్ (Akshay Oberai) బృందం ఆపరేషన్ చేపడుతుంది. ఈ ఎయిర్ ఫోర్స్ టీమ్ గగనతలంలో శత్రువులపై ఎలా పోరాటం చేసింది ? పాటీ మళ్లీ రూల్స్ ను క్రాస్ చేశాడా ? రెండేళ్ల క్రితం ఏ ఘటనలో అతనిపై నింద పడింది ? అన్నదే మిగతా స్టోరీ.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×