BigTV English

This Week Theatre & OTT Movies: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్.. వాళ్లదే హవా!

This Week Theatre & OTT Movies: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్.. వాళ్లదే హవా!

 


Theatre and ott release movies

Movies &  Webseries Releasing in Theatre and OTT: ప్రతీవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు థియేటర్లు, ఓటీటీల్లోకి వస్తాయి. అలాగే ఈ వారం కూడా వినోదాన్ని పంచేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పెద్దసినిమాలేవీ లేకపోయినా.. ఆసక్తికరమైన కథలతో, ఇంట్రస్టింగ్ టైటిల్స్ తో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు థియేటర్లలోకి వస్తున్నాయి.


ఓం భీమ్ బుష్

తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకు హీరో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబినేషన్లో శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ఓం భీమ్ బుష్ (Om bheem bush) నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ షురూ చేసిన ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల కానుంది. ఒక గ్రామంలో గుప్తనిధులున్నయాని తెలుసుకున్న ఈ ముగ్గురు సైంటిస్టులుగా వెళ్తారు. ఆ తర్వాత ఏమైందన్నదే కథ.

హద్దులేదురా..

ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా హద్దులేదురా. రాజశేఖర్ రావి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో రూపొందించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది.

Also Read: నయనతారా మజాకా.. 40 సెకన్ల యాడ్ కి రూ. 5 కోట్లా?

అనన్య

ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంది. జంధ్యాల ఉమా నాగశివ గంగాధర శర్మ ఈ సినిమాను రూపొందించారు. హర్రర్ ప్రేమకథా చిత్రంగా రూపొందించిన ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నారు.

ఓటీటీలోకి భూతద్దం భాస్కర్ నారాయణ, అబ్రహం ఓజ్లర్

శివ కందుకూరి హీరోగా.. రాశీసింగ్ కథానాయికగా.. పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో.. రూపుదిద్దుకుని మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఈ సినిమా.. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్ కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లను రాబట్టి.. విజయాన్ని అందుకుంది. మిధున్ మేనుయేల్ థామస్ దర్శకత్వంలో.. జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో, మమ్ముట్టి గెస్ట్ గా నెగిటివ్ రోల్ లో నటించిన ఈ సినిమా మార్చి 20వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల కాబోతోంది.

Also Read: Hanuman OTT Release : ఓటీటీలోనూ హనుమాన్ రికార్డ్.. కానీ ఆ సీన్లు కట్ చేశారా ?

అమెజాన్ ప్రైమ్ లో..

మార్చి 17న ప్లే గ్రౌండ్ (హిందీ సిరీస్)

మార్చి 19న మరక్కుమ నెంజాం (తమిళం)

మార్చి 21న ఏ వతన్ మేరే వతన్ (హిందీ)

మార్చి 21న రోడ్ హౌస్ (హాలీవుడ్)

నెట్ ఫ్లిక్స్

మార్చి 21న 3 బాడీ ప్రాబ్లమ్ (వెబ్ సిరీస్)

మార్చి 21న ఫైటర్ (హిందీ)

మార్చి 22న లాల్ సలామ్ (తమిళం, తెలుగు)

డిస్నీ+హాట్ స్టార్

మార్చి 22న లూటేరా (హిందీ)

ఈటీవీ విన్

మార్చి 22న సుందరం మాస్టర్

జియో సినిమా

మార్చి 21న ఓపెన్ హైమర్ (హాలీవుడ్)

బుక్ మై షో

మార్చి 19న ఫ్రాయిడ్స్ లాస్ట్ సెషన్ (హాలీవుడ్)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×