E-Paper
Advertisement

Mangampeta Glimpse: చేయాల్సింది యుద్ధం కాదు శివతాండవం.. అదిరిపోయిన గ్లింప్స్

Mangampeta Glimpse: చేయాల్సింది యుద్ధం కాదు శివతాండవం.. అదిరిపోయిన గ్లింప్స్
Advertisement

Mangampeta Glimpse:  ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు , కొత్త హీరోలు, కొత్త కథలు అని లైట్ తీసుకోవడానికి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే సామెతను గుర్తుచేసుకొనేలా ఉంది. చిన్న సినిమాలే కదా అని లైట్ తీసుకుంటే.. కొత్తవారు, కొత్త కథలతో మంచి మంచి హిట్స్ ను అందుకుంటున్నారు. ఇక ఈ ఏడాది  ఇలాంటి కొత్త కథలకు ఢోకా లేదు.

తాజాగా మరో కొత్త కథతో కొత్తవారు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చంద్రహాస్ కే, అంకిత సాహా జంటగా గౌతం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మంగంపేట. భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలోనే వవిడుదలకు సిద్దమవుతుంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్  ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ‘ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం..’ అంటూ తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ మధ్యలో  యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు.

విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.మంగంపేట టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. మరి ఈ సినిమా  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×