BigTV English

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Car Discount Offers September 2024: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. అందులోనూ పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరిగిపోవడంతో చాలా మంది వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఎలక్ట్రిక్ వాహనంతో పొందడంతో ఎక్కువ మంది వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.


అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంకొన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ మరింత పెంచుకునేందుకు తరచూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అలాంటి సమయం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్ కారును డిస్కౌంట్ ఆఫర్‌లో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం.

ఎందుకంటే దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న టాటా మోటార్స్ తాజాగా తన ఎలక్ట్రిక్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు పొందొచ్చని తెలిపింది. అందువల్ల ఈ నెలలో అంటే సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలని భావించే వారు దాదాపు రూ.2.05 లక్షల వరకు తగ్గింపు పొందుతారని తెలిపింది. టాటా మోటార్స్ తన MY 2023 టాటా నెక్సాన్ ఈవీపై దాదాపు రూ.2.05 లక్షల వరకు తగ్గింపు అందిస్తుంది. ఈ మోడల్‌తో పాటు మరిన్ని వేరియంట్లపై డిస్కౌంట్లు అందిస్తుంది.


Also Read: సేల్స్‌లో దుమ్ము దులిపేసిన కియా సెల్టోస్.. ఇప్పుడు మరో కొత్త కలర్‌లో వచ్చేసింది..!

అందులో టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ ఎల్‌ఆర్ టాప్ వేరియంట్‌పై రూ.1.80 లక్షల తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో ఎంట్రీ లెవెల్ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ వేరియంట్‌పై రూ.20,000 తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా టాటా నెక్సాన్ ఈవీ‌లోని అన్ని ఇతర వేరియంట్లపై రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. అలాగే 2023 టాటా నెక్సాన్ ఈవీ మోడల్ ఇయర్‌పై రూ.25,000 ఎక్స్‌ట్రా క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది. ఇలా వేరియంట్‌ను బట్టి తగ్గింపును అందిస్తుంది.

ఇక దీని ఫీచర్లు, పవర్‌ట్రైన్, బ్యాటరీ, మైలేజీ విషయానికొస్తే.. టాటా నెక్సాన్ ఈవీ మొత్తం 5సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్‌ట్రైయిన్‌గా 2 బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌లను పొందుతారు. అందులో మొదటిది 30 కిలోవాట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ గరిష్టంగా 129bhp శక్తిని, 215nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మరొక బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 40.5 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్‌లో వస్తుంది. ఇది గరిష్టంగా 144bhp, 215nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో చిన్న బ్యాటరీ 325 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో పెద్ద బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్ పై 465 కి.మీ మైలేజీ అందిస్తుంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×