BigTV English

Update on MAD Sequel: మొన్న మ్యాడ్ మ్యాక్స్ అన్నారు.. ఇప్పుడేమో మ్యాడ్ స్క్వేర్ అంటున్నారేంటి..?

Update on MAD Sequel: మొన్న మ్యాడ్ మ్యాక్స్ అన్నారు.. ఇప్పుడేమో మ్యాడ్ స్క్వేర్ అంటున్నారేంటి..?

MAD Movie Team Following Tillu Square: గతేడాది వచ్చిన సినిమాల్లో హిట్ టాక్ అందుకున్న సినిమా మ్యాడ్. సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా.. గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.


మనోజ్, అశోక్, దామోదర్ ముగ్గురు స్నేహితులు తమ కాలేజ్ టైమ్ చేసిన సరదాలు.. గొడవలు ఎంతో వినోదాత్మకంగా చూపించాడు. ముఖ్యంగా దామోదర్ కామెడీకి ఎవరైనా పడిపడి నవ్వాల్సిందే. ఇక ఈ సినిమా చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుందని తెలిపారు. గత కొన్నిరోజులుగా మ్యాడ్ మ్యాక్స్ పేరుతో దీనికి సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. ఇక తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు మ్యాడ్ మ్యాక్స్ టైటిల్ కాకుండా మ్యాడ్ స్క్వేర్ టైటిల్ ను ఫిక్స్ చేయడమే కాకుండా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

Also Read: Manifesto: గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, బాలికలకు రూ. 50 వేలు?


ఇక ఈ పూజా కార్యక్రమాలకు టిల్లు అన్న సిద్దు జొన్నలగడ్డ హాజరై కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. అయితే ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ అని పెట్టడానికి కారణం టిల్లు అనే తెలుస్తోంది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన చిత్రానికి టిల్లు స్క్వేర్ అని పెట్టడంతో మంచి హిట్ అందుకుంది. ఇక అదే సెంటిమెంట్ మ్యాడ్ కూడా వర్తిస్తుందేమో అని మ్యాడ్ స్క్వేర్ పెట్టారని అంటున్నారు. కాలేజ్ నుంచి బయటికి వెళ్లిన మ్యాడ్ గ్యాంగ్.. ఆ తరువాత ఏం చేశారు అనేది ఈ మ్యాడ్ స్క్వేర్ లో చూపించనున్నారు. మరి ఈ సినిమాతో ఈ గ్యాంగ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×