BigTV English

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Game Changer: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పాట పాడేసుకుంటున్నారు. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్,  జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ ఇంకా హోల్డ్ లోనే ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు ఈ మధ్యనే డిసెంబర్ అని చెప్పినా..అది నిజమయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయనే చెప్పాలి.

ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్అప్డేట్ కావాలని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న విషయం తెల్సిందే. దీంతో మేకర్స్.. ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక కీలక అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్.. ఈ నెలలోనే రానుందని తెలుపుతూ.. చరణ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఇక క్లాస్ లుక్ లో చరణ్ అదరగొట్టేశాడు. తలకు ఎర్ర కండువా కట్టుకొని చరణ్ కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్ లో జాతర జరుగుతున్న వాతావరణాన్ని చూపించారు. జాతరలో చరణ్ స్టెప్స్ వేస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫ్యాన్స్ కు అసలు సిసలైన పండుగ స్టార్ట్ అయ్యిందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×