E-Paper
Advertisement

Niharika NM: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్.. ఏకంగా గీతా ఆర్ట్స్ లోనే

Niharika NM: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్.. ఏకంగా గీతా ఆర్ట్స్ లోనే
Advertisement

Niharika NM: నిహారిక NM.. సోషల్ మీడియా ఎక్కువ వాడేవారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ ను మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందరిలా కాకుండా విభిన్నమైన ఇంగ్లిష్ అసెంట్ తో కామెడీని పంచుతూ అభిమానులకు దగ్గరయింది.

చెన్నెలో పుట్టి పెరిగిన ఈ చిన్నది బెంగుళూరులో చదువుకొని.. యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. మహేష్ బాబు, యష్, వరుణ్ ధావన్ లాంటివారు కూడా వారి సినిమా రిలీజ్ కు ముందు నిహారికతో ప్రమోషన్స్ వీడియోలు చేసి రిలీజ్ చేశారు అంటే.. ఆమె రేంజ్ ఎలాంటిదో తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా నిహారిక.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

Advertisement

ఇక నేడు నిహారిక NM టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో నిహారిక అడుగుపెడుతుంది. నేడు ఈ చిన్నదాని పుట్టినరోజు కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ గీతా ఆర్ట్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. టాలీవుడ్ కు స్వాగతం నిహారిక NM అంటూ చెప్పుకొచ్చారు. చెప్పాలంటే నిహారిక మంచి ఛాన్స్ నే పట్టిందని చెప్పాలి.

మొదటి సినిమానే గీతా ఆర్ట్స్ లో అంటే మాటలు కాదు. ఈ సినిమా కనుక హిట్ అయితే అమ్మడు రేంజ్ మారిపోతుంది. అసలు నిహారిక.. ఏ హీరో సరసన నటిస్తోంది. లేకపోతే కొత్త హీరో, హీరోయిన్లను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. మరి.. టాలీవుడ్, నిహారికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×