BigTV English

Viswam Movie Story Leaked: గోపీచంద్ ‘విశ్వం’ స్టోరీ లీక్.. శ్రీనువైట్ల కిర్రాక్ కంబ్యాక్?

Viswam Movie Story Leaked: గోపీచంద్ ‘విశ్వం’ స్టోరీ లీక్.. శ్రీనువైట్ల కిర్రాక్ కంబ్యాక్?

Viswam movie Story leaked: గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


స్టోరీ లీక్

విశ్వం మూవీలో గోపీచంద్, అతడి ఫ్రెండ్ మిలటరీ ఆఫీసర్స్‌గా ఉంటారు. తడి ఫ్రెండ్‌కు అప్పటికే పెళ్లై భార్య, ఒక కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్‌లో గోపీచంద్ ఫ్రెండ్, అతడి భార్య చనిపోతారు. దీంతో వాళ్ళ పాపను గోపీచంద్ పెంచుకుంటాడు. అప్పటికి గోపీచంద్‌కు కూడా కుటుంబం ఉండదు. దీంతో ఆ పాపను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అలా సాఫ్ట్‌గా సాగిపోతున్న క్రమంలో పోలీస్ ఆఫీసర్‌‌గా ఉన్న నటుడు సుమన్‌ను కొన్ని కారణాల వల్ల విలన్‌ అతడిని హత్య చేస్తాడు. అదే సమయంలోనే ఆ హత్యను గోపీచంద్ పెంచుకుంటున్న పాప చూస్తుంది. దీంతో ఎవరికైనా చెప్పేస్తుందేమోనని, సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆ పాపను చంపడానికి విలన్‌ ప్రయత్నిస్తుంటాడు. విలన్ ఆ పాప వెంట పడుతుంటే.. హీరో ఆ పాపను కాపాడుకోవడానికి ఎన్నో సాహసాలు చేస్తాడు.


ఈ నేపథ్యంలోనే ఎంతో మంది విలన్‌లను మట్టుబెడుతుంటాడు హీరో. ఎన్నెన్నో యాక్షన్ సీన్లు ఉంటాయి. ఇక సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి అసలు ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అది ఎవ్వరూ ఊహించలేరు కూడా. ఈ ట్విస్ట్‌తో సినిమా రేంజ్ మారిపోతుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటో.. ఆ ట్విస్ట్‌లో అంతలా ఏముందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: కొట్టారు తీసుకున్నాం.. రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం, గోపిచంద్ ‘విశ్వం’ టీజర్ చూశారా?

‘వెంకీ’ ట్రైన్ సీన్ తరహాలో కామెడీ

రవితేజ నటించిన ‘వెంకీ’ మూవీలో ట్రైన్ కామెడీ సీన్ ఇప్పటికే ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ సినిమా రిలీజ్ అయి ఎన్నో ఏళ్లు గడిచింది. కానీ అలాంటి సీన్లతో ఇప్పటికి ఏ మూవీ రాలేదు. వచ్చినా అంతటి రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు గోపీచంద్ ‘విశ్వం’ మూవీ అదే తరహా ట్రైన్ సీన్ కామెడీతో వస్తుంది. ముందుగా టీజర్‌లో చూసినట్లుగా ఈ ట్రైన్‌లో గోపీచంద్, వెన్నెల కిషోర్, వి.టి.వి గణేష్ జనార్థనన్ కామెడీ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుంది. అలాగే ఈ కమిడియన్లకు తోడు నరేష్‌తో పాటు మరెంతో మంది తోడయ్యారు. దీంతో సినిమాలో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని టీజర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఈ మూవీలో గోపీచంద్ సరసన అందాల ముద్దుగుమ్మ కావ్యాథాపర్ నటిస్తుంది. ఆమెతో పాటు నటుడు నరేష్, సునీల్, పృథ్వీ, వెన్నెల కిషోర్ సహా మరెంతో మంది నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా అంచనాలు పెంచేసింది. ఇందులో ముఖ్యంగా కామెడీ బాగా పండించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సగం కామెడీ, మిగతా సగం యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేశారు. మొదటిగా హీరోయిన్‌కు వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. నీకు ఎలాంటి అబ్బాయి కావాలని ఆమెకు అడగడంతో.. ‘‘నేను కనపడగానే నా మీద పడిపోవాలి. నైట్ అంతా మెలుకువగా ఉండాలి’’ అని హీరోయిన్ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో రొమాంటికి సన్నివేశాలు కూడా ఆశించవచ్చు. ఆ తర్వాత రొమాంటికి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇలా ప్రతి అప్డేట్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×