Chittoor: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారు పాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఓ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. బస్సు చిత్తూరు వైపు వెళ్లుతుండగా.. ఆ ఇనుప కమ్మీల లారీ బెంగళూరు వైపు వస్తున్నది. లారీ అతివేగంతో ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ డివైడర్‌ను దాటుకుని వచ్చి బస్సును ఢీకొంది.
శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాకీ అదుపు తప్పి.. బస్సును ఢీకొట్టింది. వాహనాలు వేగంగా ప్రయాణించడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు ముందు భాగం, లారీ ముందు భాగం కూడా దారుణంగా ధ్వంసమయ్యాయి. బస్సు ముందు భాగంలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు మరణించారు.
గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కు అంబులెన్స్‌ల సహాయంతో తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పాట్‌కు వచ్చారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నంది. అధికారులు ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఘాట్ వైపున ఉన్న లారీని బస్సు ఢీకొంది. దీంతో రోడ్డులో సింహభాగం ఈ రెండు వాహనాలతో నిండిపోయింది.
Also Read: Harish Rao: రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. నిన్నే తిరుపతి జిల్లాలో ఓ లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ఘటన మరువకముందే తాజాగా చిత్తూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.