E-Paper
Advertisement

Guntur Kaaram: ‘గుంటూరు కారం’లో మార్పులు.. ఈ సీన్లనే యాడ్ చేస్తున్నారంట..?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’లో మార్పులు.. ఈ సీన్లనే యాడ్ చేస్తున్నారంట..?
Advertisement

Guntur Kaaram: ఈ ఏడాది సంక్రాంతి రేసులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ ‘గుంటూరు కారం’. మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత వారి ఆశలు అడియాశలయ్యాయి. వారు అనుకున్నంత రేంజ్‌లో మూవీ లేకపోవడం, రొటీన్ స్టోరీ, రొటీన్ పాత్రలు కావడంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

కానీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.240 కోట్ల వరకు గ్రాస్, రూ.122 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ వెర్షన్‌ కోసం ఆడియాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రన్ టైం ఎక్కువ కావడంతో అమ్మ సాంగ్, కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ కట్ చేశారట. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌లను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×