BigTV English
Advertisement

Nita Ambani : నీతా అంబానీకి ఇష్టమైన చీర ఇదే..!

Nita Ambani : నీతా అంబానీ.. ఈ పేరుకు పరిచయాలే అక్కర్లేదు.గోల్డ్ చీర కట్టినా.. నక్లెస్ పెట్టినా ఆమె రేంజే వేరు. చాలా సింపుల్‌గా.. చాలా గ్రాండ్‌.. స్టయిలుష్ లుక్స్‌తో కనిపిస్తారు. ముఖేశ్ అంబానీ భార్యగానే స‌క్సెస్ ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.నీతా అంబానీ స్కూల్ టీచర్ నుండి కెరీర్‌ను స్టార్ట్ చేసి.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వ్యాపారవేత్త స్థాయికి ఎదిగి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచింది.

Nita Ambani : నీతా అంబానీకి ఇష్టమైన చీర ఇదే..!

Nita Ambani : నీతా అంబానీ.. ఈ పేరుకు పరిచయాలే అక్కర్లేదు. గోల్డ్ చీర కట్టినా.. నక్లెస్ పెట్టినా ఆమె రేంజే వేరు. చాలా సింపుల్‌గా.. చాలా గ్రాండ్‌.. స్టయిలుష్ లుక్స్‌తో కనిపిస్తారు. ముఖేశ్ అంబానీ భార్యగానే స‌క్సెస్ ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. నీతా అంబానీ స్కూల్ టీచర్ నుండి కెరీర్‌ను స్టార్ట్ చేసి.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వ్యాపారవేత్త స్థాయికి ఎదిగి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు.


నీతా అంబానీ అందం, ఖరీదైన దుస్తులలో ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ప్రత్యేక సందర్భాలలో నీతా అంబానీ పటోలా చీరలు ధరించి కనిపిస్తారు. ఈ చీరలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ఈ చీరలు ఆధునిక, సాంప్రదాయ రూపాన్ని అందిస్తాయి. గుజరాతీ పటాన్ పటోలా చీరలకు దాని సొంత గుర్తింపు ఉంది.

పటోలా చీరలు సుమారు 900 సంవత్సరాల నాటివట. ఈ చీరలు సాధారణంగా నైరూప్య, రేఖాగణిత నమూనాలతో ఉంటాయి. చీరలపై కలశం, పువ్వులు, శిఖరాలు, ఏనుగులు, మానవ బొమ్మలు, చిలుకలతోపాటు గుజరాత్ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు ఉంటాయి. ఏడాది పాటు కష్టపడితేనే ఒక పటోలా చీర సిద్ధమవుతుంది.


నీతా అంబానీ ఇష్టంగా కట్టుకునే పటోలా చీరల విలువ లక్షల్లో ఉంటుంది. సాధారణంగా నీతా అంబానీ రూ. 1.70 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య ధర కలిగిన చీరలను ధరిస్తుంటారు. ఈ చీరకు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.

గుజరాజ్‌లో కొన్ని కమ్యూనిటీల వేడుకలలో పటోలా చీర తప్పనిసరి. ఎందుకంటే దుష్ట కన్ను తొలగించడానికి పటోలాకు మంత్ర శక్తులు ఉన్నాయని వారు నమ్ముతారు. ఇది మాత్రమే కాదు. పటోలా చీరలు ముఖ్యంగా కుమార్తెల వివాహాలకు ఇస్తారు. దీని ద్వారా కుమార్తె, ఆమె భవిష్యత్ మంచిగా ఉంటుందట.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×