E-Paper
Advertisement

HanuMan: ‘హనుమాన్’ చూసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏమన్నారంటే..?

HanuMan: ‘హనుమాన్’ చూసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏమన్నారంటే..?
Advertisement

HanuMan: కంటెంట్ బాగుంటే ఎంతటి చిన్న సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘హనుమాన్’ మూవీతో మరోసారి రుజువైంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎవరూ ఊహించని ఘన విజయాన్ని అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కలెక్షన్లలో కూడా తన హవా చూపిస్తోంది. ఇక నార్త్‌లో కూడా ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.

అంతేకాకుండా ‘కేజీఎఫ్’ హిందీ వసూళ్లను కూడా ఈ మూవీ బ్రేక్ చేసి అబ్బురపరచింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 దక్షిణాది మూవీల జాబితాలో స్థానం సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ మూవీని ప్రశంసించారు. తాజాగా ఈ మూవీని తన స్నేహితులతో కలిసి ఆయన చూశారు. అనంతరం తన అనుభూతిని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Advertisement

దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయస్వామి స్ఫూర్తితో తెరకెక్కించిన ప్రతీ సన్నివేశం తనను ఆకట్టుకున్నట్లు తెలిపారు. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని అన్నారు. ఈ మేరకు మూవీ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ‘హనుమాన్’ టీంతో దిగిన ఫొటోను పంచుకున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×