BigTV English

freedom fighter habib : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన.. 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్

freedom fighter habib : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన.. 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్

freedom fighter habib : లేటు వయసులో పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. ముప్పైలు, నలభైలు దాటినా ఇంకా పెళ్లి వైపు మొగ్గుచూపని ప్రసాదులెందరో ఉన్నారు. మగవాళ్లేనా.. మేమేమీ తక్కువ కాదంటున్నారు ఆడపిల్లలు. మూడు పదులు దాటినా.. పెళ్లి ఊసెత్తితే.. ఇంతెత్తున గుర్రుమంటున్నారు. అసలు పెళ్లెందుకు ? బ్రతికినన్నాళ్లూ.. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. కానీ.. పెద్దవాళ్లు మాత్రం ఇలా ఎక్కువరోజులుండలేరని చెబుతారు. ఊరికే అంటారా మరి.. పెద్దవారి మాట.. పెరుగన్నం మూట అని.


పెళ్లి అనేది మన తర్వాతి తరానికి నాంది మాత్రమే కాదు. కష్టసుఖాల్లో.. తల్లిదండ్రుల తర్వాత మనతో పాటూ ఒక వ్యక్తి తోడుండాలి. వయసులో ఉన్నపుడు నాకెవ్వరూ అక్కర్లేదనుకున్నా.. వయసు మళ్లే కొద్దీ.. నాక్కూడా ఒక తోడుంటే బావుండన్న ఆలోచన మనిషిని తినేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆయన.. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవించలేక ఒక మహిళను పెళ్లాడాడు. వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా 54 సంవత్సరాలు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో.. ఈ ఫ్రీడమ్ ఫైటర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్ కు చెందిన హబీబ్ నజర్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ప్రస్తుతం ఆయన వయసు 103 ఏళ్లు. నూరేళ్లు దాటిన ఈ వయసులో ఆయనకు తోడు కావాలనిపించింది. తనకన్నా వయసులో 54 ఏళ్లు చిన్నదైన.. 49 ఏళ్ల ఫిరోజ్ జహన్ ను పెళ్లాడారు. అంటే.. ఇప్పటి వరకూ ఆయన పెళ్లి చేసుకోలేదనుకుంటే పొరపాటే. గతంలో ఆయన రెండు పెళ్ళిళ్లు అయ్యాయి. ఆ ఇద్దరు భార్యలు కూడా మరణించారు. వారి తర్వాత ఆయన్ను పట్టించుకునేవారు లేకుండా పోయారు. దాంతో ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. భర్తను కోల్పోయిన 49 ఏళ్ల ఫిరోజ్ జహన్ ను హబీబ్ నజర్ పెళ్లాడారు. గతేడాదే వీరికి వివాహం జరగ్గా.. తాజాగా ఆ పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి.


తన మూడవ పెళ్లిపై.. నజర్ మాట్లాడుతూ.. జీవితంలో తనకెలాంటి లోటూ లేదన్నారరు. రెండవ భార్య చనిపోయాక ఒంటరిగా జీవించలేకపోయానని, అందులో ఫిరోజ్ అంగీకారంతో ఆమెను మూడో వివాహం చేసుకున్నానని తెలిపారు. ఈ వివాహం తనకిష్టమయ్యే జరిగిందని ఫిరోజ్ జహన్ తెలిపింది. ఒక వృద్ధుడిని పెళ్లాడటంలో ఎవరి బలవంతం లేదని స్పష్టం చేసింది. నజర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పింది. కాగా.. నజర్ మొదటి వివాహం మహారాష్ట్రలోని నాసిక్ లో జరుగగా, రెండవ వివాహం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×