BigTV English

Harsha Sai Case : మత్తు మందు ఇచ్చి అత్యాచారం… ఆపై వీడియోలు… బయటికి వస్తున్న హర్ష సాయి లీలలు

Harsha Sai Case : మత్తు మందు ఇచ్చి అత్యాచారం… ఆపై వీడియోలు… బయటికి వస్తున్న హర్ష సాయి లీలలు

Harsha Sai Case : పేదలకు సాయం చేస్తూ ఎప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యే హర్ష సాయి పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో మోసం చేశాడని, యూట్యూబర్ హర్ష సాయిపైన కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మ ఈ కేసు ఫైల్ చేసింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి, 2 కోట్ల వరకు తన దగ్గర నుంచి తీసుకున్నాడని, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబర్ హర్ష సాయి పైన సెక్షన్ 376(2), 376(N), 354 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. హర్ష సాయితో బాధిత యువతి ‘మెగా’ అనే సినిమా చేస్తుంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమాను ఆ యువతి నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించే వీరి మధ్య గొడవలు అయినట్టు తెలుస్తుంది.


మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం…

యూట్యూబర్ హర్ష సాయి తనను చాలా మోసం చేశాడని ఆరోపిస్తుంది. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, అలాగే దానికి సంబంధించిన వీడియోలను కూడా తీశాడని, హర్ష సాయిపై ఆరోపిస్తుంది. ఈ వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. హర్ష సాయి నుంచి ఆయన యూట్యూబ్ ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ తెలిపింది.


కాపీ రైట్ విషయంలో విభేదాలు..

సరిగ్గా సంవత్సరం క్రితం యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు ఓ టీజర్ వచ్చింది. దానికి టైటిల్ మెగా. ఈ సినిమాను శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో మిత్ర శర్మ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించే వీరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా కాపీ రైట్స్ గురించే హర్ష సాయి ఇలాంటి పనులు చేశాడని సమాచారం. బాధిత యువతికి మత్తు మందు అత్యాచారం చేశారట. తర్వాత ఆ వీడియోలను చూపించి, తనకు కాపీ రైట్స్ ఇవ్వకపోతే, వీడియోలను బయట పెడుతా అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది.

స్పందించిన హర్ష సాయి…

అయితే తాజా ఈ ఆరోపణలపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఈ వివాదంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. డబ్బుల కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయని, తన లాయర్ ఇప్పటికే ఆ పనిలో ఉన్నారని చెప్పారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తన అడ్వకేట్ తనికొండ చిరంజీవి తెలియజేస్తారని సోషల్ మీడియా వేదికగా హర్షసాయి చెప్పారు.

కాగా, నార్సింగ్ పోలీసులు 376(2), 376(N), 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో, యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. హర్ష సాయి తన దగ్గర ఉన్న అన్ని ఫోన్లను స్విచ్ చేసి పరారు అయినట్టు మార్నింగ్ కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ వార్తలు బయటికి వచ్చిన కొద్ది గంటల్లోనే హర్ష సాయి తన సోషల్ మీడియాలో స్పందించారు.

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×