BigTV English

Mahalakshmi Murder Case: మహాలక్ష్మి హత్య కేసు నిందితుడిపై వైద్యుల నివేదిక.. అతన్ని కట్టడి చేయకపోతే అంతే సంగతులు ?

Mahalakshmi Murder Case: మహాలక్ష్మి హత్య కేసు నిందితుడిపై వైద్యుల నివేదిక.. అతన్ని కట్టడి చేయకపోతే అంతే సంగతులు ?

Mahalakshmi Murder Case Accused: కర్ణాటకలోని నెలమంగల సమీపంలో మహాలక్ష్మి (29) అనే యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బెంగళూరులోని వ్యాలికవల్ లో ఉన్న ఇంట్లో ఒక రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా నరికిన మహాలక్ష్మి శరీరాన్ని పోలీసులు రికవర్ చేశారు. అయితే తాజాగా.. మహాలక్ష్మిని అంత కిరాతకంగా నరికి చంపిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. మహిళ శరీర భాగాలను పరీక్షించిన విక్టోరియా ఆస్పత్రి వైద్యులు.. ఆ అమ్మాయిని అంతదారుణంగా హతమార్చిన కిరాతకుడు సడోమా సూకిస్ట్ క్ అనే నేర స్వభావంతో రగిలిపోయినట్లు తెలిపారు.


మహాలక్ష్మిని అంత కిరాతకంగా చంపిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టకపోతే మరికొందరు మహిళలు అతని అరాచకానికి బలయ్యే ప్రమాదం ఉందని తేల్చేశారు వైద్యులు. మహాలక్ష్మి శరీరాన్ని ముక్కలుగా చేసినపుడు.. ప్రతీసారి అతను సైకో ఆనందాన్ని అనుభవించినట్లు వివరించారు. మొత్తం 30 ముక్కలుగా నరికినట్లుగా ప్రాథమికంగా భావించినా.. వైద్య పరీక్షల్లో 59 ముక్కలు చేసినట్లు ఉందని తేల్చారు. కేవలం ఆమె తలనే మూడు ముక్కలుగా నరికేశాడని విచారం వ్యక్తం చేశారు వైద్యులు.

మల్లేశ్వరంలోని ఒక బట్టల దుకాణంలో పనిచేసిన మహాలక్ష్మికి ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, ఆర్నెలలకే వారిద్దరూ విడిపోయారని, దానిని తట్టుకోలేక ఆ వ్యక్తే ఇదంతా చేశాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అతని ఆచూకీ కోసం పోలీసులు వెస్ట్ బెంగాల్, పరిసర రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.


Also Read: బెంగుళూరు మహాలక్ష్మి హత్య, 30 ముక్కలు చేసి, ఆపై..

మహాలక్ష్మికి గతంలోనే పెళ్లై.. ఆరేళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా 9 నెలల క్రితం ఇద్దరూ విడిపోయి ఉంటున్నట్లు తెలిపారు. మాజీ భర్త హేమంత్ దాస్ ఈ హత్యోదంతంపై మీడియాతో మాట్లాడుతూ.. మహాలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్న అష్రాఫ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం బెంగళూరులోని స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత అతను బెంగళూరుకు రాకూడదని చెప్పారని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నాడు దాస్.

యూపీ నుంచి వచ్చిన అష్రాఫ్ ఒక బార్బర్ షాపులో పనిచేసేవాడని, తన భార్యతో అక్రమ సంబంధం గురించి గతేడాది ఏప్రిల్ – మే నెలలో తెలిసిందన్నారు. ప్రస్తుతం తానొక మొబైల్ షాపులో పనిచేస్తున్నానని, 25-30 రోజుల క్రితం ఆమెను ఒక దుకాణం వద్ద కలిసినట్లు చెప్పాడు.

ఈ హత్యకేసు పై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ కొంత సమాచారం తెలిసిందని, కానీ దానిని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. కేసు విచారణ పూర్తయ్యాకే అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

 

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×