BigTV English

Harsha Sai : యువతితో అడ్డంగా దొరికిపోయిన హర్ష సాయి… వీడియో వైరల్

Harsha Sai : యువతితో అడ్డంగా దొరికిపోయిన హర్ష సాయి… వీడియో వైరల్

Harsha Sai : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ హర్ష సాయి మీద రే*ప్ కేసు నమోదు కావడం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో తన దగ్గర 2 కోట్లను వసూలు చేసి మోసం చేశాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుండగా, తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో వైరల్ అవుతుంది.


యువతితో హర్ష సాయి వాగ్వాదం

తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో హర్ష సాయి ఒక అమ్మాయితో తన ఫ్లాట్ బయట గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఏ విషయం గురించి గొడవ జరుగుతుంది? ఆ అమ్మాయి, ప్రస్తుతం కంప్లైంట్ చేసిన అమ్మాయి ఒక్కరేనా ? అనే  విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు హర్ష సాయి సాక్ష్యాలు అంటూ బయట పెట్టిన పలు వాయిస్ రికార్డింగ్ లు కొత్త అనుమానాలకు తెర తీస్తున్నాయి. అందులో బాధితురాలు హర్ష సాయిని ప్రేమించట్లేదు అంటూ గొడవ పడుతున్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఇతను రిజెక్ట్ చేసినట్టుగా ఉంది ఆడియో రికార్డింగ్ లలో. అయితే అదంతా అసలు ఒరిజినల్ రికార్డింగ్ లేనా? లేదంటే ఎడిట్ చేసి రిలీజ్ చేశాడా? అనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే టాలీవుడ్ ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు షేక్ చేస్తుండగా, తాజాగా హర్ష సాయి వివాదం సంచలనంగా మారింది. ఇక హర్ష సాయి లాయర్ ఈ కేసు గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా హర్ష సాయి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.


YouTuber Harsha Sai and His Father Face Complaint from Young Woman

డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారా?

పెళ్లి పేరుతో తన దగ్గర రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని, తన న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నానంటూ సదరు యువతి హర్ష సాయిపై కంప్లైంట్ చేయడం దుమారం రేపింది. ఆ కంప్లైంట్ గురించి వార్తలు బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే పరారీలో ఉన్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అంతలోనే హర్ష సాయి ఇంస్టాగ్రామ్ లో దీనిపై స్పందిస్తూ నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి అంటూ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత హర్ష సాయి లాయర్ మాట్లాడుతూ హర్ష సాయి పాపులారిటీని నాశనం చేయడానికి, డబ్బు కోసమే ఆ అమ్మాయి ఇలా చేస్తోందని, గత రెండేళ్ల ముందు వరకు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది అంటే.. ఆ బాధిత యువతి హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమాను తీయడానికి రెడీ అయిందని, నెట్ ఫ్లిక్స్ లో ఓ సినిమా తీయడానికి ఇద్దరి మధ్య డీల్ జరిగిందని లాయర్ చెప్పాడు. అలాంటిది హర్ష సాయి ఆమె దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడు అని ప్రశ్నిస్తూనే ఆమె హర్ష సాయిని షూరిటీ అడిగితే ఇవ్వలేదు, అందుకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అంటూ కేసు గురించి పలు వివరాలను చెప్పుకొచ్చారు. మరి ఈ కేసు ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×