BigTV English

Harsha Sai: ఊహించని ట్విస్ట్స్.. లాయర్లు చెప్పింది వింటే మైండ్ బ్లాక్..!

Harsha Sai: ఊహించని ట్విస్ట్స్.. లాయర్లు చెప్పింది వింటే మైండ్ బ్లాక్..!

Harsha Sai.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Harsha Sai) తనపై అత్యాచారం చేశాడు అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. తనకు మత్తుమందు ఇచ్చి తనపై దాడి చేసి నగ్నంగా వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించడంతో స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇకపోతే తనపై కేసు నమోదు అయిందని తెలియగానే ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు హర్ష సాయి. దీంతో తన లాయర్ ని రంగంలోకి దింపారు. దీంతో సదరు బాధితురాలు కూడా తన లాయర్ ను బరిలోకి ఫైట్ కి దింపింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఇరు వర్గాల లాయర్లు తమ క్లైంట్ ని సపోర్ట్ చేస్తూ పలు కీలక కామెంట్లు చేశారు. ఇక వీరిద్దరి కేసులో వారి లాయర్లు చెప్పిన మాటలు పరిశీలిస్తే, నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పవచ్చు.


హర్ష సాయి పై బాధిత యువతి లాయర్ కామెంట్స్..

Harsha Sai: Unexpected twists.. Mind block when listening to lawyers..!
Harsha Sai: Unexpected twists.. Mind block when listening to lawyers..!

తన క్లైంట్ హర్ష సాయిని ఒక పాట కోసం ఆమె అప్రోచ్ అయ్యింది. అయితే తన దగ్గర స్టోరీ ఉందని, దానిపై మూవీ తీద్దామని హర్ష సాయి కోరాడు. దానికి బాధితురాలు టీం కూడా ఓకే చెప్పి, మెగా అనే పేరుతో సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సినిమా చేయాలంటే తనకు అకామిడేషన్ కావాలని హర్ష సాయి అడగడంతో బాధితురాలు టీం కూడా ఒక విల్లా లో హర్ష సాయికి అకామిడేషన్ ఏర్పాటు చేసింది. అక్కడ ఉంటూనే స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో బాధితురాలని విల్లాకి పిలిచి డ్రింక్స్ లో సెడేటివ్స్ కలిపి , నగ్న వీడియోలు తీసి రేప్ చేశాడు. ఆ తర్వాత వాడు అడ్డం పెట్టుకొని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ దృష్టికి యువతి తీసుకెళ్తే.. హర్ష సాయి కెరియర్ ఫెయిల్ అవుతుందని, బ్రతిమాలి పెళ్లి చేస్తానని ఆయన ఫాదర్ ప్రామిస్ చేశాడట. ఇకపోతే దానిని గుడ్డిగా నమ్మిన ఈమె సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం అయిపోయింది. ఇలాంటి టైం లో కాపీ రైట్స్ ఇవ్వను. నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ కొత్త రూల్ పెట్టడంతో దానికి బాధిత యువతి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫోటోలు , వీడియోలు మార్ఫింగ్ చేసి బాధితురాలిదే తప్పు అంటూ ఆడియోలు క్రియేట్ చేసి రిలీజ్ చేశాడు. అలాగే సినిమా నుంచి తానే తప్పుకొని మంచివాడిలా నటిస్తున్నాడు. ఈ కేసులో హర్ష సాయితో పాటు ఇమ్రాన్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరును కూడా కంప్లైంట్ లో పొందుపరిచాము అంటూ బాధిత యువతి తరపు లాయర్ మాట్లాడారు.


బాధిత యువతిపై హర్ష సాయి లాయర్ కామెంట్స్..

ఇక హర్ష సాయి లాయర్ మాట్లాడుతూ.. హర్ష సాయి ఎదుగుదలను సక్సెస్ ను చూసి ఓర్వలేక ఈ కేసు పెట్టాను. అతడిని డీ ఫెమ్ చేయాలని పెట్టిన ఒక అబద్ధపు కేసు ఇది. డబ్బు కోసమే నా క్లైంట్ హర్ష సాయిపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ప్రేమ, పెళ్లి అని కూడా అబద్ధాలే రెండేళ్ల క్రితం హర్షను కలిసింది. ఇద్దరికీ ఏడాదిగా సంబంధాలు లేవు. సాంగ్లో నటించాలని హర్ష సాయిని కోరగా. ఆయన నిరాకరించాడు. దీంతో పగబట్టి కావాలనే కంప్లైంట్ చేస్తోంది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణకు ఈమె ఎవరో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×