E-Paper
Advertisement

Kill Movie: ఇంత వరస్ట్ గా తీశారేంట్రా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పై నెటిజన్స్ ట్రోల్స్.

Kill Movie: ఇంత వరస్ట్ గా తీశారేంట్రా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పై నెటిజన్స్ ట్రోల్స్.
Advertisement

Kill Movie.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం కిల్ మూవీ (Kill Movie) .. గత 20 రోజులుగా ఓటీటీ లో హిందీలోనే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచే ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి తెలుగుతో పాటు తమిళ్ , మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మోస్ట్ వైలెంట్ మూవీ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా జూలై 5న థియేటర్లలో విడుదలై అక్కడ ఒక సంచలనమే సృష్టించింది.

నిన్నటి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న కిల్ మూవీ..

Advertisement

ఇందులో ఆడియన్స్ కూడా ఊహించని ట్విస్ట్ లు, వణుకు పుట్టించే సన్నివేశాలతో ఆద్యంతం క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక రేంజ్ లో ఈ సినిమాకి రెస్పాన్స్ లభించింది. అక్కడ భారీ విజయం అందుకోవడంతో ఓటిటిలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అత్యంత హింసాత్మక మూవీగా ఈ సినిమా పేరు సంపాదించుకుంది. కానీ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదని చెప్పవచ్చు. నిన్నటి నుంచి తెలుగు లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. సినిమా చూసిన తర్వాత తెలుగు ఆడియన్స్ కామెంట్స్ వింటే నిజంగా ఆశ్చర్యం అనిపించక మానదు. ఇంత చెత్త డబ్బింగ్ తమ జీవితంలో చూడలేదు చూడబోము అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్

చెత్త డబ్బింగ్ అంటూ తెలుగు ఆడియన్స్ కామెంట్స్..

Kill Movie: Netizens Trolls on Bollywood Blockbuster Movie.
Kill Movie: Netizens Trolls on Bollywood Blockbuster Movie.
Advertisement

ఇంత చెత్తగా డబ్బింగ్ చేసి సినిమాను విడుదల చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ వర్షన్ అసలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. అసలు అక్కడ వచ్చే సన్నివేశాలకు ఆ డబ్బింగ్ కి, ఆ తెలుగుకి నిజంగా చచ్చిపోవాలనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే వరస్ట్ మూవీ, వరస్ట్ డబ్బింగ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఆ సినిమాలోని కొన్ని క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలాంటి డబ్బింగ్ ఎక్కడైనా విన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ మధ్య ఈ సినిమాను తెలుగులో రీమేక్ కూడా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలే వరస్ట్ మూవీ దీనికి రీమేక్ కూడానా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కిల్ సినిమా కథ..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎక్కువగా రైల్ లోనే సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఢిల్లీ నుంచి రాంచికి వెళ్లే రైలులో బందిపోట్లు, ప్యాసింజర్లపై చేసిన దాడిని హీరో ఎలా తిప్పి కొట్టారు. అసలు బందిపోట్ల దాడుల్లో హీరోయిన్, ఆమె కుటుంబం ఎలా ఇరుక్కుంది.. వీటి నుంచి హీరో ఎలా కాపాడారు ..అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రానికి డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా.. లక్ష లల్వాని, తన్యా మణిక్తలా కీలక పాత్రల్లో నటించారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×