E-Paper
Advertisement

Adivi Sesh: అడివి శేష్ అసలు పేరేంటో తెలుసా.. ఎందుకు మార్చుకున్నాడో తెలిస్తే నవ్వాగదు ?

Adivi Sesh: అడివి శేష్ అసలు పేరేంటో తెలుసా..  ఎందుకు మార్చుకున్నాడో తెలిస్తే నవ్వాగదు ?
Advertisement

Adivi Sesh: హీరో సన్నీ చంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసా.. ? ఆగండి.. ఆగండి.. మాకు నవీన్ చంద్ర తెలుసు.. చమ్మక్ చంద్ర తెలుసు.. ఈ సన్నీ చంద్ర ఎవరు.. ? కొత్త హీరోనా.. ? అని అడిగేయకండి. ఎందుకంటే సన్నీ చంద్ర మీ అందరికి సుపరిచితమైన హీరో, హిట్ సినిమాలతో కుర్రకారును తన అభిమానులుగా మార్చుకున్న హీరో. ఏంటి.. ఇంకా ఎవరో తెలియలేదా.. సన్నీ చంద్ర ఎవరో కాదు స్టార్ హీరో అడివి శేష్. అది అలా చెప్పండి.. శేష్ గురించి మాకెందుకు తెలియదు అంటారా.. అయితే శేష్ అసలు పేరు సన్నీ చంద్ర అని కూడా తెలియాలి. అవును మీరు విన్నది నిజమే శేష్ అసలు పేరు సన్నీ చంద్ర.

ఇండియాలో పుట్టినా అమెరికాలో పెరిగిన ఈ కుర్రాడు.. అక్కడే చదువుకున్నాడు. ఆ సమయంలోనే అక్కడ సన్నీ లియోన్ బాగా ఫేమస్. దీంతో అందరూ సన్నీ చంద్రను.. సన్నీ లియోన్ అంటూ ఏడిపించేవారట. దీంతో వారి టార్చర్ భరించలేక. పేరు మార్చుకున్నాడట శేష్. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శేష్ చెప్పుకొచ్చాడు.

Advertisement

” అమెరికాలో నేను చదువుకునేటప్పుడు నను సన్నీ లియోన్.. సన్నీ లియోన్ అని ఏడిపించేవారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఒకసారి నాన్న దగ్గరకు వెళ్లి నేను పేరు మార్చుకుంటాను.. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పాను. అయితే శేష్ అని పెట్టుకో అన్నారు. తనకు నచ్చిన క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరుమీద సన్నీ అని పెట్టానని, పంతులుగారు.. శ అనే అక్షరంతో పేరు ఉండాలని చెప్పారు. అందుకే శేష్ అని పెట్టుకో అని అన్నారు. అప్పటినుంచి నా పేరు అడివి శేష్ గా మారిందని” తెలిపాడు.

సినిమాలపై ఆసక్తితో ఇండియా వచ్చిన శేష్.. సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తరువాత కర్మ అనే సినిమాతో హీరోగా మారిన శేష్ .. పంజాలో విలన్ గా మెప్పించి అందరికి దగ్గరయ్యాడు. ఈ సినిమా విజయం అందుకోలేకపోయినా శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత క్షణం, గూఢచారి, హిట్, మేజర్ లాంటి సినిమాలతో స్టార్ గా మారాడు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాతో శేష్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×