E-Paper
Advertisement

Saripoda Shanivaram : నాని హిట్ రేంజ్ సినిమాకి సరిపోవా ఈ కలెక్షన్లు?

Saripoda Shanivaram : నాని హిట్ రేంజ్ సినిమాకి సరిపోవా ఈ కలెక్షన్లు?
Advertisement

Hero Nani movie Saripoda Shanivaram two days collections worldwide: విడుదలైన తొలి రోజు..తొలి షో నుంచే సరిపోదా శనివారం మూవీ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఈ వారం దూసుకుపోతోంది. సాధారణంగా శుక్రవారం విడుదలవుతాయి సినిమాలు. అయితే గురువారమే ఈ సినిమాను రిలీజ్ చేశారు నిర్మాతలు. దీనితో వీకెండ్ ఈ ఆదివారం దాకా నాలుగు రోజులు కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఈ వారాంతరంలోగానే నాని నటించిన సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తుందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

డిఫరెంట్ మూవీస్ తో వస్తున్న నాని

Advertisement

మొదటినుంచి నాని ఒక జోనర్ సినిమాలకు కట్టుబడి ఉండకుండా డిఫరెంట్ సినిమాలతో వస్తున్నాడు. అందుకే నాని నటిస్తే మినిమం గ్యారెంటీ కలెక్షన్లు అని నిర్మాతలు నమ్ముతారు. ఒకప్పుడు ఆ క్రేజ్ మాస్ మహరాజ్ రవితేజకు ఉండేది. తర్వాత నాని ఆ స్టేటస్ అందుకున్నారు. ఫ్యామిలీ హీరోగానూ, మాస్ అండ్ క్లాస్ హీరోగానూ మెప్పిస్తూ వస్తున్న నాని దసరా మూవీలో పూర్తి స్థాయి మాస్ పాత్రలో ఒదిగిపోయారు. అయితే హాయ్ నాన్న మూవీ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. మృణాళ్ ఠాకూర్ తో జతకట్టిన నాని ఆ మూవీని కూడా యావరేజ్ టాక్ తోనే హిట్ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు నాని. తన సహజమైన నటనతో ఆకట్టుకుంటూ మన పొరుగింటి కుర్రాడు యాక్ట్ చేస్తున్నాడు అనిపించేలా ఉంటారు నాని. ఇక హిట్ టాక్ తెచ్చుకున్న సరిపోదా శనివారం మూవీలో హీరో నాని క్యారెక్టర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో, ఎమోషన్స్ పండించడంలో ప్రేక్షకులను వంద శాతం మెప్పించారు.

తొలి రోజే రూ.9 కోట్ల నెట్ కలెక్షన్లు

Advertisement

ప్రతి సన్నివేశంలోనూ వేరియేషన్స్ చూపిస్తూ సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు నాని. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో రొమాన్స్ బాగా కుదిరింది. ప్రియాంక కు సైతం మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రే లభించింది. ఇక విలన్ గా ఎస్ జె సూర్య నాని కి ధీటుగా నటించారు. మురళీ శర్మ, ఎస్ జె సూర్య ల మధ్య వచ్చే సీన్స్ కు ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యారు. సాయుకుమార్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథ మీద కన్నా కథనం మీద సరిపోదా శనివారం మూవీని నడిపించారు. ప్రేక్షకులు ఎక్కడా బోర్ గా ఫీలవ్వరు. ఇవన్నీ కలిసి సరిపోదా శనివారం మూవీని హిట్ మూవీగా మలిచాయి. అయితే సరిపోదా శనివారం తొలి రోజే ఇండియాలో రూ.9 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టింది. కేవలంరెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.8.75 కోట్లు రాబట్టింది.

రెండు రోజుల్లో రూ.41 కోట్ల గ్రాస్..

రెండో రోజు కలెక్షన్లు దాదాపు రూ.3.25 కోట్లకు పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే రెండు రోజుల గ్రాస్ కలెక్షన్లు రూ.41 కోట్లు వచ్చాయి. ఈ వీకెండ్ లోగా రూ.50 కోట్ల మార్క్ కు చేరువయ్యే సూచన కనిపిస్తోంది. అయితే ఈ మూవీ సేఫ్ జోన్ లో రావాలంటే మరో రూ.28 కోట్ల కలెక్షన్లు రాబడితే బయ్యర్స్ సేఫ్. శని, ఆదివారాలలోకా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి స్టాండింగ్ కలెక్షన్లు వచ్చినట్లయితే ఈ వినాయక చవితి దాకా సరిపోదా శనివారం మూవీకి ఢోకా లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడం నాని సినిమాకు కలిసొచ్చే అంశం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×