E-Paper
Advertisement

Actor Raj Tarun : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు: హీరో రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు.. ఇదిగో వీడియో

Actor Raj Tarun : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు: హీరో రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు.. ఇదిగో వీడియో
Advertisement

Actor Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి హిట్ పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగానే అతడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేకపోతుంది. అయినా పట్టువదల కుండా విజయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘నా సామిరంగ’ మూవీలో కీలక పాత్రలో నటించాడు. ఇందులో ఈ హీరోతో పాటు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించి అదరగొట్టేశారు.

ఇక సోలోగా అయితే హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగానే ఈ సారి ఒక భారీ హిట్టు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు రమేశ్ కడుముల దర్శకత్వలో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఈ దర్శకుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఇందులో రాశీసింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. గోవింద రాజు సమర్పణలో ఈ చిత్రాన్ని కేఐటీఎన్ శ్రీనివాస్, మురళీధర్ నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభం అయింది. క్రైమ్ కామెడీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్‌ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా లేదా అనేది చూడాలి.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన జబర్దస్త్ రోహిణి!.. ఏడుస్తున్న వీడియో వైరల్

Advertisement

ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఎలాంటి హిట్లు లేక సతమతవుతున్న రాజ్ తరుణ్ తన రియల్ లైఫ్‌లో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా అతడి ప్రియురాలు లావణ్య అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్నానని ఆమె తెలిపింది.

అంతేకాకుండా తామిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామంటూ ఆమె చెబుతోంది. అయితే సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ ఆరోపిస్తోంది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌ని వదిలేయాలని.. వదలక పోతే తనను చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఇందులో బాగంగానే తనను అన్యాయంగా డ్రగ్స్‌ కేసులో ఇరికించారని వాపోయింది. ఈ కేసులో తాను 45 రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×