E-Paper
Advertisement

Anchor Rohini Arrested: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన జబర్దస్త్ రోహిణి!.. ఏడుస్తున్న వీడియో వైరల్

Anchor Rohini Arrested: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన జబర్దస్త్ రోహిణి!.. ఏడుస్తున్న వీడియో వైరల్
Advertisement

Anchor Rohini Arrested: ఈ మధ్య రేవ్ పార్టీల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ చాలా మంది సెలెబ్రిటీలు ఈ వ్యవహారంలో కటకటాలపాలయ్యారు. ఇటీవలే బెంగళూరు రేవ్ పార్ట్‌ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. టాలీవుడ్‌కి సంబంధించిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో టాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ రేవ్ పార్టీలో నటి హేమతో పాటుగా మరికొంతమంది కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో హేమను హైలైట్ చేశారు.

ఈ పార్టీలో తాను పాల్గొనలేదంటూ కూడా మొదట్లో వీడియోలు షేర్ చేసింది. ఆ తర్వాత అక్కడి పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేయగా అంతా బయటపడింది. కాగా ఈ నటిని అరెస్ట్ చేయడమే కాకుండా కొద్ది రోజుల పాటు జైల్లో కూడా పెట్టారు. అయితే ఇప్పుడు బుల్లితెరకు చెందిన మరో నటి రేవ్‌ పార్టీలో పట్టుబడినట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Also Read: మీర్జాపూర్ సీజన్ 3తో సహా ఇవాళ ఎన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయంటే..?

జబర్దస్త్ కామెడీ షోలో పలు స్క్రిప్ట్‌లు చేస్తూ తన కామెడీతో ఎంతో మందిని కబుపుబ్బా నవ్వించిన కమెడియన్ రోహిణి తాజాగా రేవ్ పార్టీలో పట్టుబడినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. కమెడియన్‌గా చేస్తూనే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది రోహిణి. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. అలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్‌లు అందుకుంటుంది.

Advertisement

ఆమె కామెడీ టైమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో దర్శకులు కూడా ఆమెతో కామెడీ పాత్రలే చేయిస్తున్నారు. ఇక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్న రోహిణి ఇప్పుడు యాంకర్‌గా కూడా పలు షోలకు చేస్తుంది. ఈ నేపథ్యంలో రోహిణి రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బయటకొచ్చిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజమైన రేవ్ పార్టీ వీడియో కాదని తెలుస్తోంది. ఏదో ప్రమోషనల్ వీడియోలా అనిపిస్తుందని పలువురు అంటున్నారు. ఏదో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను రోహిణి చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆమె బయటకొస్తున్న సమయంలో ఆమెను ప్రశ్నలు వేస్తున్న మీడియా ప్రతినిధుల మైక్ మీద బయట ఎక్కడా లేని ఛానల్ సింబల్ కనిపిస్తున్నాయి. అదీగాక ఆమె వెనుకున్న పోలీసు కూడా ఒక యాక్టింగ్ పర్‌సన్‌లా కనిపిస్తున్నాడు.

Also Read: కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’ నుంచి వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బాధ్యతలు!

ఆమె బర్త్ డే బాయ్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే బయటకొస్తున్న సమయంలో ఆమెను ప్రశ్నిస్తుండగా.. నాకేం సంబంధం లేదు సర్.. బర్త్ డే పార్టీ ఉంటే వచ్చాను. పాజిటివ్ వచ్చింది కదా మేడం అని అంటే.. నాకు ఇంకా టెస్ట్‌లు కూడా చేయలేదని.. పాజిటివ్ కూడా రాలేదని రోహిణి చెప్తున్నట్లు కనిపిస్తుంది. మేడం ఏదైనా చెప్పండి అని అడగ్గా.. ఇలాంటి ఎన్‌ఆర్ఐల పార్టీలున్నాయని పిలిస్తే వివరాలు తెలుసుకోకుండా వెళ్లొద్దు అంటూ ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం నిజంగా ఏదో సినిమా ప్రమోషన్స్ కోసమే అని అర్థమవుతోంది. చూడాలి మరి త్వరలో దీనిపై ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×