BigTV English

Big Twist: రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్ ట్విస్ట్‌, మీడియా ముందుకు లావణ్య

Big Twist: రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్ ట్విస్ట్‌, మీడియా ముందుకు లావణ్య

Hero Raj Tarun Has Affair With Many Girls Lavanyas Sensational Comments: గత రెండురోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్, లావణ్య వ్యవహారం సంచలనంగా మారింది. యంగ్ హీరో తనతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ పెట్టుకుని రాజ్‌ తనని మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ మాట్లాడి ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. లావణ్య, మస్తాన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.


అందుకే 2017 నుండే దూరం ఉంటున్నానని, ఆమె నాపై చేస్తున్న కామెంట్స్‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.దీంతో లావణ్యకు పోలీసులు రివర్స్ నోటీసులు జారీ చేయడంతో ఆమె పారిపోయింది. ఈ క్రమంలో మాల్వి కూడా స్పందించి తనకు అసలు లావణ్య ఎవరో తెలియదని రాజ్ తరుణ్ కోస్టార్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీంతో అంతా రాజ్ తరుణ్ తప్పులేదు.ఆమెనే డబ్బుల కోసం చేసిందని భావించారు. ఇంతటితో రాజ్, లావణ్య కథ ఎండ్ అయ్యిందని అందరూ భావించారు.

Also Read: కల్కి’ సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది: ‘మహాభారత్’ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్


కానీ తాజాగా లావణ్య మీడియా ముందుకు వచ్చి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్ల నుంచి దూరం అయ్యాడని చెప్పాడు,కానీ అందులో నిజం లేదు. మా పెళ్లి మ్యాటర్‌ వాళ్ల తల్లిదండ్రులకు కూడా తెలుసు. ప్రతి వినాయక చవితికి మా ఇరువురి కుటుంబాలు కలుస్తుంటాయి. రాజ్ తరుణ్ చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసింది. కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాకు అతనే కావాలి. రాజ్ లేకపోతే బతకలేను. నన్ను అన్నిరకాలుగా వాడుకుని మాల్విని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. మాల్వి అన్న చంపుతా అని బెదిరిస్తున్నాడు. నాకు ప్రాణ భయం ఉంది. అన్ని ఆధారాలు కూడా పోలీసులకు అందించాను. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి.అయితే ఇదంతా జరుగుతుందని రాజ్ వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు. మాకు చెప్పి మీరు పెళ్లి చేసుకోలేదు కదా అతనికి ఓకే అయితే మాదేం లేదు అంటున్నారు.

రాజ్ నాతో ఇంట్లో గొడ్డు చాకిరి చేయించాడు. అతని కోసం భరించాను. అసలు కేసు పెట్టాలని అనుకోలేదు కానీ మాల్వీ వల్లనే అలా చేశాను. ఇవన్నీ చేయడం వల్ల రాజ్‌కు కోపం రావొచ్చు కాబట్టి క్షమించమని అడుగుతాను. మాల్వికి గెట్ లాస్ట్ మా లైఫ్‌ల నుంచి వెల్లిపోమంటాను. రాజ్ చెప్తున్నట్లుగా మస్తాన్ ‌కు నాకు ప్రేమాయణం లేదు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులో అతను నిందితుడు. నాకు మ్యూచువల్ ఫ్రెండ్ అంతే ఆ కేసు గురించే మాట్లాడుతానని చెప్పుకొచ్చింది లావణ్య. మరి వీరిద్దరి గొడవ వ్యవహారం ఎంత దూరం వెలుతుందో తెలియాలంటే మళ్లీ రాజ్ తరుణ్ స్పందించేంత వరకు క్లారిటీ వచ్చేలా లేదు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×