Kalki 2898 AD Sequel: ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘kalki 2898 ad’ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధిస్తుంది. ఈ చిత్రానికి పది రోజుల్లో రూ.800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఇప్పుడంతా ఈ సినిమాపైనే చర్చనడుస్తోంది. తాజాగా ఈ సినిమా పై మహాభారత్ టీవీ షో యాక్టర్ నితీశ్ భరద్వాజ్ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర మరణిస్తుందని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ మహాభారత పాత్రలను చాలా చాకచక్యంగా వాడుకున్నాడని.. కల్కి అవతారం గురించి ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా హిందీ సినిమాల నిర్మాతలు దక్షిణాదిని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. ఎందుకంటే వారు మన పురాణాలు, ఇతిహాసాలను చాలా కూలంకుషంగా, లోతుగా చూపిస్తున్నారు అని సౌత్ ఇండస్ట్రీపై ప్రసంశలు కురిపించాడు.
కల్కి సినిమా చూస్తే అచ్చం మ్యాడ్ మ్యాక్స్ సినిమాల నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుందని అన్నాడు. సైన్స్ ఫిక్షన్‌ని, పురాణాలను కలిపి దర్శకుడు చాలా కొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ అసలు కథ కంటే.. సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నా.. ఆ రెండింటిని కలిపి చూపించడంలో బాగా సక్సెస్ అయ్యాడని కొనియాడారు. ఇక కల్కి 2898 ఏడీ సీక్వెల్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సీక్వెల్‌లో కర్ణుడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ పాత్ర మరణిస్తుందని జోష్యం చెప్పారు.
Also Read: ప్రభాస్ మరో రికార్డు.. కలెక్షన్ల కింగ్ ‘కల్కి’.. మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే?
అలాగే ఇందులో అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) కృష్ణుడు విమోచన మార్గాన్ని కనుగొన్నప్పటికీ అతనిది విలర్ రోల్ అని తెలిపారు. అయితే ఇందులో కృష్ణుడి ఫేస్ హైడ్ చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే కృష్ణుడి ముఖాన్ని చూపించకుండా ఉండటంతో చాలా మందిలో ఆసక్తి మొదలైంది. ఎందుకు కృష్ణుడి ఫేస్‌ను దర్శకుడు రివీల్ చేయలేదు అనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో కలుగగా.. తాజాగా దానిపై కూడా నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కృష్ణుడిని మిస్టీరియస్‌గా చూపించాలనే భావనతోనే ఎవరన్నది చూపించకుండా హైడ్ చేశానని తెలిపాడు. ఒకవేళ అతను ఎవరనేది తెలిసిపోతే అది కూడా ఒక పాత్ర అయిపోతుంది కదా అని అన్నాడు. అందువల్లనే అలా కృష్ణుడి ఫేస్ రివీల్ చేయకుండా మిస్టీరియస్‌గా ఉంచుతూనే ఆయన గొప్పదనాన్ని చూపించాలనుకున్నానని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక ఏది ఏమైనా మహాభారత్ నటుడు నితీశ్ భరద్వాజ్ వాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.