E-Paper
Advertisement

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..
Advertisement

Janaka Aithe Ganaka Censor: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ సినిమాల లైనప్ మాములుగా లేదు. ఒక్క సినిమా పూర్తి అవ్వకుండానే మరో సినిమాను లైన్లో పెడుతూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ మధ్య సుహాస్ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. కథల ఎంపిక విషయంలో కాస్త తొందర పడ్డాడు అనే టాక్ ను సుహాస్ అందుకున్నాడు. తాజాగా మరో కామెడీ ఏంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక ‘ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కామెడితో కడుపుబ్బా నవ్వించేసింది. కానీ తాజాగా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ ఆడియన్స్ ను నిరాశ పరిచేలా ఉందని టాక్.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..

‘జనక అయితే గనక ‘ మూవీలో పచ్చిబూతులు..

Advertisement

టాలీవుడ్ హీరో సుహాస్, సందీప్ బండ్ల కాంబోలో వస్తున్నా మూవీ ‘జనక అయితే గనక ‘.. అక్టోబర్ 11న థియేటర్స్ లోకి రాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ సినిమాకి పోటీగా సుహాస్ మూవీ రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం.. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందని భావిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని మేకర్స్ చెబుతున్నారు. కానీ ఇందులో బూతులు కూడా ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. తాజాగా మూవీ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ లో రెండు బూతులు ఉన్నాయని తెలుస్తుంది. ఉచ్చా, బాంచత్ అనే పదాలు ఉన్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నారు.. ఈ సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పి బూతులు పెడితే ఎలా దిల్ రాజు గారు అని సెన్సార్ రిపోర్ట్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ‘జనక అయితే గనక ‘ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు సుహాస్, డైరెక్టర్ బాగా కష్ట పడుతున్నారు. రిలీజ్ అవ్వడానికి రెండురోజులు మాత్రమే ఉండటంతో రెండు, మూడు రోజులకే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు ‘జనక అయితే గనక’ మూవీ కూడా కచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని భావిస్తున్నారు. కంటెంట్ కూడా కొత్తగా ఉండటంతో దసరా ఫెస్టివల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని మూవీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు.. మరి మూవీ విడుదల అయిన తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×