BigTV English
Advertisement

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తమిళనాడులో సందడి మామూలుగా ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా అంతా మారిపోయింది. సందడి అనేది మినిమమ్ కనిపించడం లేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఎన్నో రజినీకాంత్ సినిమాలు.. ప్రేక్షకులకు కనీసం ఇంప్రెస్ చేయలేకపోవడం కూడా దీనికి కారణమే. ఇప్పుడు ‘వేట్టయాన్’లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించడానికి వచ్చేస్తున్నారు రజినీ. అందుకే రజినీకాంత్ ఫ్యాన్స్ కోసం తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఫ్యాన్స్ కోసం మొదటి నాలుగు రోజులు మరిన్ని స్పెషల్ షోలను యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది.


స్పెషల్ స్క్రీనింగ్స్…

టీజే జ్ఞానవేల్, రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘వేట్టయాన్’. ఈ సినిమాలో రజినీ ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటించారు. ఇప్పటికే మూవీ నుండి విడుదలయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. అందులో వింటేజ్ రజినీని చూశామని ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 10న ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే ఫ్యాన్స్ కోసం ‘వేట్టయాన్’ స్క్రీనింగ్స్‌ను పెంచాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. విడుదలయిన రోజు నుండి నాలుగు రోజుల పాటు ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ కొనసాగనున్నాయి.


Also Read: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

స్టార్ క్యాస్టింగ్…

‘వేట్టయాన్’ కోసం స్పెషల్‌గా ఉదయం 9 గంటల షోలను అనుమతించింది తమిళనాడు ప్రభుత్వం. అక్టోబర్ 10 నుండి 13 వరకు ఈ స్పెషల్ షోలు కొనసాగనున్నాయి. దీంతో రజినీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు రానా, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు నటించారు. ముఖ్యంగా రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడడం కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ, కోలీవుడ్ సూపర్ స్టార్ ఫైట్.. మూవీలోనే హైలెట్‌గా నిలుస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ వల్ల అమితాబ్ బచ్చన్.. రజినీకి పైఅధికారి పాత్రలో నటిస్తున్నాడని, ఆయన చెప్పే ప్రతీ మాటకు రజినీ ఎదురు వెళ్తాడనే విషయంపై క్లారిటీ వచ్చింది.  వీరితో పాటు ఫాహద్ ఫాజిల్, దుషారా విజయన్, రావు రమేశ్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టైటిల్ రేపిన చిచ్చు…

ఒకవైపు ‘వేట్టయాన్’ గురించి రజినీకాంత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుండగా.. మరోవైపు తెలుగు ప్రేక్షకులు.. ఆయనపై, ఈ సినిమాపై ఫైర్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల డబ్బులు కావాలి కానీ తెలుగులో టైటిల్ మాత్రం పెట్టరా అంటూ మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ టైటిల్ వివాదం.. తెలుగులో ‘వేట్టయాన్’ బుకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలావరకు థియేటర్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలదో మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. చాలావరకు రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ‘వేట్టయాన్’ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×