BigTV English

HHVM vs PS 2: ప‌వ‌న్ అంటే మ‌ణిర‌త్నంకి ఎందుకంత కోపం?

HHVM vs PS 2: ప‌వ‌న్ అంటే మ‌ణిర‌త్నంకి ఎందుకంత కోపం?

HHVM vs PS 2:ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో య‌మాగా ట్రెండ్ అయింది. ఆయ‌న అన్‌స్టాప‌బుల్ షూటింగ్‌లో పాల్గొన‌డ‌మే అందుకు కార‌ణం. తెలుగు మీడియాలో ఇది రీజ‌న్ కావ‌చ్చు. కానీ త‌మిళ మీడియాలో మ‌రో రీజ‌న్‌తో ట్రెండ్ అవుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తున్న సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు. పీరియాడిక్ కాస్ట్యూమ్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు క్రిష్‌. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌న్న‌ది నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ప్లాన్‌. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో దిగుతున్న అదే రోజును సెల‌క్ట్ చేసుకున్నారు మ‌ణిర‌త్నం. మీరు ఒక్క‌రిగా వ‌స్తే, నేను మ‌ల్టీస్టార‌ర్‌తో సేమ్ డేట్‌కి దిగుతా అంటూ ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వ‌న్ సీక్వెల్‌ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


ఆల్రెడీ 500 క్రోర్స్ ప్ల‌స్ క‌లెక్ష‌న్ల‌తో హిట్ సినిమాగా నిలిచింది పొన్నియిన్ సెల్వ‌న్‌. చోళుల‌కు సంబంధించిన క‌థ‌ను ఆథంటిక్‌గా తెర‌కెక్కించార‌ని మెచ్చుకున్నారు చారిత్ర‌కకారులు. తెలుగులో ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఫిక్ష‌నల్ డ్రామానే. అటు పొన్నియిన్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కింది పీయస్‌2. విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష‌తో పాటు చాలా మంది ప్ర‌ముఖ న‌టీనటులు న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌కి క్లాష్ కావ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్లు షేర్ అవుతాయంటున్నారు ట్రేడ్ పండిట్స్. కాస్త డేట్ల‌ను అటూ అటూ స‌ర్దుకున్నా ఇద్ద‌రూ లాభ‌ప‌డొచ్చ‌నే మాట‌లూ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇక్క‌డ ప‌వ‌న్ ఫిక్స్ అయ్యారు. అక్క‌డ మ‌ణి ఫిక్స‌య్యారు కాబ‌ట్టి, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోరు త‌ప్ప‌దు మ‌రి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×