E-Paper
Advertisement

Hi NANNA : యానిమల్ గర్జన కు .. హాయ్ నాన్న జంకుతుందా..

Hi NANNA : యానిమల్ గర్జన కు .. హాయ్ నాన్న జంకుతుందా..
Advertisement
Hi NANNA

Hi NANNA : డిసెంబర్ నెలలో ఎన్నో సినిమాలు విడుదల కావాల్సి ఉంది .. కానీ సలార్ విడుదల డేట్ ఫిక్స్ చేశాక చాలా వరకు సినిమాలు తమ రిలీజ్ డేట్ మార్చుకున్నాయి. ఇలా రిలీజ్ డేట్ ప్రీపోన్ చేసుకున్న చిత్రం నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ,పాటలు మంచి సెన్సేషన్ సృష్టించాయి. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ హైలైట్ గా వస్తున్న ఈ మూవీ మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. అయితే ఊహించకుండా ట్రాక్ లోకి వచ్చిన యానిమల్ హాయ్ నాన్నకు టాటా.. బాయ్.. బాయ్ చెప్పేలా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎమోషనల్ డెప్త్ ఉన్న రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీతో నాని డిసెంబర్ 7వ తారీఖున బరిలోకి దిగడానికి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరొక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా ఒంటి చేతి పోరాటం చేస్తున్నాడు. హీరోయిన్ మృణాల్ వేరే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న కారణంగా హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ కి ఎక్కువ సమయం కేటాయించలేకపోతోంది. అందుకని నాని ఒక్కడే మూవీ ఎలాగైనా ప్రమోట్ చేయాలి అని వెరైటీ మార్గాలు ట్రై చేస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎలక్షన్ ఫీవర్ ని కూడా తన మూవీ ప్రమోషన్ కి వాడుకున్నాడు నాని. వెరైటీ ప్రయత్నాలతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఊహించని విధంగా రంగంలోకి దిగిన 

యానిమల్ ట్రైలర్.. అప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలను తలకిందులు చేసింది. దీంతో ముందంజలో ఉన్న హాయి నాన్న బజ్ చల్లారి పోయేలా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత యానిమల్ మూవీ పై అంచనాలు అమాంతం పెరిగాయి.

Advertisement

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్స్ తో పాటు మహేష్ బాబు, రాజమౌళి లాంటి సెలబ్రిటీస్ సందడి చేశారు. నిన్న మొన్నటి వరకు ఎక్కడ శబ్దం కూడా వినిపించని ‘యానిమాల్’.. ఒక్కసారిగా గర్జిస్తోందా అనిపిస్తోంది. దీంతో నాని కూడా యానిమాల్ కు ధీటుగా తన మూవీ సౌండ్ పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు అభిమానులు. రెండు సినిమాల విడుదల కి గట్టిగా వారం కూడా డిఫరెన్స్ లేదు. ఇక నాని మళ్లీ తన మూవీ హైట్ పెంచేలా ప్రమోషన్స్ పై కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×