E-Paper
Advertisement

Indraja: ఆమె కోరిక తీర్చలేకపోయాను.. స్టేజిపై వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ

Indraja: ఆమె కోరిక తీర్చలేకపోయాను.. స్టేజిపై వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ
Advertisement

Indraja: సీనియర్ నటి ఇంద్రజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. జబర్దస్త్ లో రోజా ప్లేస్ ను రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమెలా ఎవరు ఉంటారు అనుకుంటుండగా.. ఇంద్రజ వచ్చింది. రోజా నాథ ఫైర్ బ్రాండ్ కాకపోయినా.. అందరిని తల్లిగా ఆదరించి ఇంద్రజమ్మగా మారిపోయింది. ఏది చెప్పినా మనసులో నుంచి చెప్పి ఎన్నోసార్లు ట్రోల్ కూడా అయ్యింది. అయినా ఆమె ఏది పట్టించుకోకుండా ఆరు జబర్దస్త్.. ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక నిత్యం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏదో ఒక థీమ్ తో వస్తూ ఉండే మేకర్స్ ఈసారి మదర్స్ డే స్పెషల్ తో రానున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

ఇక ఈ ప్రోమోలో ఇంద్రజ తన తల్లిని తలచుకొని ఎమోషనల్ అయ్యింది. తన తల్లి కోరికను నెరవేర్చలేకపోయాను అంటూ ఆమె స్టేజిమీదనే వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రతి ఒక్కరు తమ తల్లులకు గిఫ్ట్ ఇచ్చి.. వారి కళ్లలో సంతోషం చూస్తుంటే.. ఇంద్రజ తన తల్లి లేదు అనే బాధను తెలిపింది. ” నేను ఎన్నో తప్పులు చేశా.. సరిద్దిదుకోలేని తప్పు కూడా చేశా.. ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకున్నా.. తల్లిదండ్రులు లేకపోతే మనం అనాధలమే. వారు చనిపోయాక ఏడవడం కన్నా.. బతికి ఉన్నప్పుడే వారిని సంతోషంగా చూసుకోవాలి. మా అమ్మ ఏడాది పాటు నన్ను గుడికి తీసుకెళ్ళు అని అడిగింది. నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె లేదు అంటూ భోరున విలపించింది.

Advertisement

కాలం తిరిగివచ్చి తన తల్లి బతికి వస్తే.. ఆమె కోరుకున్నవన్నీ చేసి పెట్టాలని ఉందని తెలిపింది. ఇంద్రజ ఎమోషనల్ అవ్వడంతో అక్కడ ఉన్నవారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రష్మీ, ఇంద్రజను ఓదార్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇంద్రజ చెప్పింది అని కాదు కానీ, తల్లిదండ్రులను బతికి ఉన్నప్పుడు చూసుకోకుండా చనిపోయాక వారికి గుడులు కట్టడం, విగ్రహాలు పెట్టడం వేస్ట్ అని నెటిజన్స్ సైతం కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×