Big Stories

Rythu Bharosa: రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Rythu Bharosa: రబీ సీజన్ రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

- Advertisement -

ఈనెల 9వ తేదీలోగా రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. దీంతో రైతు భరోసా నిధుల పంపిణీని వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

ఐదు ఎకరాల కంటే పైబడిన భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి సర్కార్ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. దాదాపు రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసి పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే ఈ రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి అవుతుందని అధికారులు భావించారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల సంఘం రైతు భరోసా నిధుల పంపిణీకి బ్రేక్ వేసింది.

అయితే గతంలో ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ.5,575 కోట్ల రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు ఎకరాలు పైబడి దాదాపు 5 లక్షల మందికి పైగా రైతులు ఉండడంతో వారికి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Also Read: మల్లరెడ్డి సీక్రెట్ రివీల్, ఆ క్రెడిట్ అంతా నాదే, కాకపోతే..

ఈ నిధులను మే 9వ తేదీలోగా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో రైతులకు హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఇచ్చిన మాట ప్రకారం మే 6వ తేదీన రూ.2వేల కోట్ల రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. తొలిరోజే చాలా మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది. అయితే రైతు భరోసా నిధుల పంపిణీపై సీఈసీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతనే మిగిలిన రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. అటే మే 13వ తేదీ తర్వాత మరలా ఈ రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News