E-Paper
Advertisement

Nidhi Aggarwal : ఆఫర్ల కోసం హాట్ బ్యూటీ పూజలు..

Nidhi Aggarwal : ఆఫర్ల కోసం హాట్ బ్యూటీ పూజలు..
Advertisement
Nidhi Aggarwal

Nidhi Aggarwal : ఏ రంగంలో అయినా ఫేమ్ అనేది ఎంతకాలం ఉంటుంది అని ఎవరం చెప్పలేము. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ అనేది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది అని ఎవ్వరం చెప్పలేం. ఒకరోజు గోల్డెన్ లెగ్ అన్న మేకర్స్.. రెండు ఫ్లాప్స్ తర్వాత ఐరెన్ లెగ్ అని ముద్రవేస్తారు. అలా ప్రస్తుతం తమ కెరీర్‌ను కష్టంగా నెట్టుకొస్తున్న హీరోయిన్లలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒకరు.

Advertisement

ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది నిధి అగర్వాల్. అందులో తన అందాన్ని చూసి బాలీవుడ్ ఆఫర్ తనను వెతుక్కుంటూ వచ్చింది. ‘మున్నా మైఖెల్’ అనే హిందీ చిత్రంలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆపై తెలుగులో అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నిధి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయినా కూడా కమర్షియల్ హిట్ పడకపోవడంతో.. తనకు ఎక్కువగా ఆఫర్లు రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగులో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అందంతో పాటు యాక్టింగ్ కూడా మెరుగుపడిందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం నిధి తలుపు తట్టింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’లో నిధి హీరోయిన్‌గా ఎంపికయ్యింది.

Advertisement

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అందుకే హరి హర వీరమల్లు చిత్రంపై క్లారిటీ లేదు. ఇది తప్పా నిధి చేతిలో మరో ఆఫర్ లేదు. అందుకే తన ఆఫర్ల కోసం దేవుడినే నమ్ముకుంది ఈ భామ. ఒక పంతులుతో కలిసి పూజలో పాల్గొంటున్న నిధి ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. దీంతో ఆఫర్ల కోసమే నిధి పూజలు చేయడం మొదలుపెట్టింది అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ పూజల వల్ల అయినా నిధికి ఆఫర్లకు వస్తాయేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×