BigTV English

Shraddha Kapoor: కాస్ట్లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!

Shraddha Kapoor: కాస్ట్లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!

Shraddha Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరుకు పరిచయాల అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరచితమే.. పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహోలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ డిజాస్టర్ అయిన కూడా శ్రద్ధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్, శ్రద్ధ కపూర్ మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ హైలెట్ అయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత శ్రద్ధ తెలుగులో సినిమా చెయ్యలేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధ, అటు సినిమాలతో పాటు ఇటు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ఖరీదైన కారుని తన గ్యారేజ్ లోకి తీసుకొచ్చింది. ఆ కారు పేరేంటి? దాని ఖరీదు ఎంతో? ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


సాహో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ.. 

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకేక్కిన భారీ బడ్జెట్ మూవీ సాహో.. ఈ చిత్రంలో ప్రభాస్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చి దక్షిణాది ఆడియెన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ శ్రద్ధా కపూర్ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఈ మధ్య నటించిన ప్రతి మూవీ మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో ఆమె రేంజ్ పెరిగింది. దాంతో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరిగింది. ఇప్పుడు ఏకంగా అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఆ కారు ఖరీదు ఎన్ని కోట్లో వివరాలిలా..


శ్రద్దా గ్యారేజిలోకి కొత్త కారు.. 

బాలీవుడ్ హీరోయిన్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. న్యూ ప్రీమియం లెక్సస్ LM 350h 4- సీటర్ కారులో ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించింది. అయితే న్యూ మోడల్ కు సంబంధించిన ఆ కారు ధర ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. లెక్సస్ LM మోడల్ కు చెందిన ఆ కారు ధర అక్షరాల రూ.2.93 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ, హై సేఫ్టీ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఈ కారుకు అంత ధర ఉంటడంతో అందరిని షాక్ అయ్యేల చేస్తుంది. జిమ్ నుంచి ఈ స్పెషల్ కారులో ప్రయాణిస్తూ కనిపించింది.. ఇలాంటి కార్లు కేవలం సెలబ్రిటీల కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తారు. బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల దగ్గర ఇలాంటి కార్లు ఉన్నాయి.. శ్రద్ధ కపూర్ గత కొన్ని రోజుల క్రితమే ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ కారును కొనుగోలు చెయ్యడం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శ్రద్ధ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కల్కి 2 లో ఏమైనా నటించబోతుందంటూ ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కల్కి సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×