OTT Movie : ఓటీటీ లోకి సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. అందులో రీసెంట్ గా జి. వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన, ఒక మూవీ ఓటీటీ లోకి రాబోతోంది. ఈ మూవీ థియేటర్లలో సందడి చేసి, మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో సముద్ర తీరంలోని ఒక గ్రామంలో చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు కనిపించకుండాపోతారు. సముద్రం చుట్టూ తిరిగే ఈ స్టోరీ, చివరి వరకూ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
జీ 5 (Zee 5) లో
ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘కింగ్స్టన్’ (Kingston). 2025, మార్చ్ 7 న విడుదలైన ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్ & ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జి. వి. ప్రకాష్ కుమార్, ఉమేష్ కెఆర్ బన్సాల్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో జి. వి. ప్రకాష్ కుమార్, దివ్యభారతి, చేతన్, అళగం పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటించి, నిర్మాతగానూ ఈ మూవీకి వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా మార్చ్ 7 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఏప్రిల్ 4 నుంచి జీ 5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1982లో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని, తూవత్తూర్ అనే తీరప్రాంత గ్రామంలో ప్రారంభమవుతుంది. ఒక అతీంద్రియశక్తి కారణంగా, ఈ గ్రామం వద్ద సముద్రం శాపానికి గురి అవుతుంది. ఈ శాపం వల్ల గ్రామస్తులు చేపల వేటకు వెళ్లలేకపోతారు, దీనివల్ల వారి జీవనాధారం కూడా కష్టం గా మారుతుంది. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడంతో, ఒకవేల వచ్చినా శవాలుగా రావడంతో, దాదాపు 43 సంవత్సరాల పాటు గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లడం మానేస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు ఒక హార్బర్ లో పనిచేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకు అందులో సంపాదన ఏ మాత్రం సరిపోదు. కింగ్స్టన్ అనే వ్యక్తి ఆ గ్రామంలో ని పరిస్తితులను చూసి, సముద్రంలోకి వెళ్లాలనుకుంటాడు. అయితే ఇదివరకే అతని తండ్రి అలా వేటకు వెళ్ళి చనిపోయి ఉంటాడు. అయినా కూడా అందులోని మర్మం ఏమిటో కనిపెట్టాలని అనుకుంటాడు.
అతను థామస్ అనే వ్యక్తి నేతృత్వంలోని స్మగ్లింగ్ గ్యాంగ్‌లో పనిచేస్తాడు. ఎలాగైనా సముద్రంలో జరుగుతున్న మారనకాండకు, సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. థామస్ ను ఎదిరించి, కింగ్స్టన్ సముద్రంలోకి తన స్నేహితులతో కలిసి వెళతాడు. ఆ శాపాన్ని తొలగించి, గ్రామానికి బతుకు మీద ఆశ తిరిగి తీసుకురావాలని అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతను సముద్రంలో చాలా సవాళ్లను ఎదుర్కుంటాడు. అక్కడ నిజంగానే ఆత్మలు కింగ్స్టన్ పడవ పై దాడి చేస్తాయి. అక్కడే అతనికి అసలు రహస్యం తెలుస్తుంది. చివరికి కింగ్స్టన్ ఆ శాపానికి విరుగుడు తెలుడుకుంటాడా ? గ్రామస్తులకు కింగ్స్టన్ భరోసా ఇస్తాడా ? ఇంతకీ ఆ శాపం ఏమిటి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే.